Tuesday, 17 November 2026

హైదరాబాద్

డీజీపీలతో కేంద్రహోంమంత్రి షిండే భేటీ

న్యూఢిల్లీ : వివిధ రాష్ట్రాల డీజీపీలతో కేంద్రహోంమంత్రి సుషీల్‌కుమార్‌షిండే సమావేశమయ్యారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారకేసుల్లో తీసుకోవల్సిన చర్యలపై చర్చించారు. అత్యాచార కేసుల్లో కఠినశిక్షలు ఉండాలని డీజీపీలు షిండేకు సూచించారు. నేరాల నిరోదానికి డీజీపీలు కొన్ని సూచనలు చేశారని హోంమంత్రి…

తిరుపతి – కరీంనగర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి- కరీంనగర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షినమధ్‌య రైల్వే నిర్ణయించింది. జనవరి 9న రాత్రి 10.40 గంటలకు తిరుపతి నుంచి కరీంనగర్‌కు, జనవరి 10న రాత్రి 7.10 గంటలకు కరీంనగర్‌…

10న హస్తినకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈనెల 10న ఢిల్లీకి బాటపట్టనున్నారు. ఇవాళ వారు తెలంగాణ అంశంపై చర్చించేందుకు సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు వారు ఢిల్లీ వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు…

కాసేపట్లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇంట్లో ఈ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కానుంది. అఖిలపక్షంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం,కర్నాటక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.

అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ను కలిసిన భాజపా

హైదరాబాద్‌: హిందూ మతాన్ని, సంప్రదాయాన్ని కించపరిచేలా మజ్లిన్‌ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను భాజపా నేతలు గవర్నర్‌ నరసింహన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈరోజు రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన భాజపా ప్రతినిధి బృందం అక్బరుద్దీన్‌పై కఠిన…

అరుణ కేసు నిందితుడు ఆత్మహత్యాయత్నం

పుణే: నల్లగొండ విద్యార్థిని అరుణ హత్య కేసు నిందితుడు శివకుమార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. పుణే నుంచి హైదరాబాద్‌ తరలిస్తుండగా రైలు నుంచి దూకి శివకుమార్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని పుణేలోని ఆస్పత్రిలో చేర్పించి పోలీసులు చికిత్స…

అక్బరుద్దీన్‌పై రంగారెడ్డి కోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రంగారెడ్డి కోర్టులో జనార్దన్‌ అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఎల్బీనగర్‌ పోలీసులను ఆదేశించింది. అక్బరుద్దీన్‌పై 121,295(ఎ),153 (ఎ) సెక్షన్ల…

సాయంత్రం ఢీల్లి వెళ్లనున్న మంత్రి జానారెడ్డి

హైదరాబాద్‌: మంత్రి జానారెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల తీర్మానాన్ని పార్టీ పెద్దలకు అందించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీర్మానం చేశారు.

వీలైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర : తెలంగాణ, కాంగ్రెస్‌ నేతల తీర్మానం

హైదరాబాద్‌: వీలైనంత త్వరగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తీర్మానం చేశారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నేడు సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నెలరోజుల్లో తెలంగాణపై నిర్ణయం తెలుపుతామన్న షిండేకు ధన్యవాదాలు…