Tuesday, 17 November 2026

హైదరాబాద్

నేడు ఢిల్లీ పోలీసులకు పోస్టుమార్టమ్‌ నివేదిక

న్యూఢిల్లీ : సామూహిక అత్యాచారానికి గురై సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని పోస్టుమార్టమ్‌ నివేదిక నేడు ఢిల్లీ పోలీసులకు అందనుంది. సింగపూర్‌లో యువతి చికిత్స పొందిన మౌంట్‌ ఎలిజబెత్‌ ఆసుపత్రి నుంచి ఈ…

వేడుకల్లో విషాదం.. పలు జిల్లాల్లో ఆరుగురి మృతి

అనంతపురం : నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు జిల్లాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు. అనంతపురంలోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి…

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్‌, సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. నేటితో రాష్ట్రంలో రాష్ట్రపతి శీతాకాల విడిది పూర్తికానుంది. ఈ మధ్యాహ్నం రాష్ట్రపతి ఢిల్లీ వెళ్లనున్నారు.

వరంగల్‌ జిల్లాలో నాలుగో రోజు యాత్ర ప్రారంభం

వరంగల్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా… మీకోసం ‘ పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో నాలుగోరోజుకు చేరింది. నేటి యాత్రను కామరెడ్డిపల్లి క్రాస్‌ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఎడమ కాలు చిటికెన వేలుకు తీవ్ర గాయంతో…

రాష్ట్రపతితో తెలంగాణ మంత్రుల భేటీ

హైదరాబాద్‌ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో తెలంగాణ ప్రాంత మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు గీతారెడ్డి, సబిత, శ్రీధర్‌బాబు, సుదర్శన్‌రెడ్డి, సారయ్య, సునీతా లక్ష్మారెడ్డి రాష్ట్రపతిని కలిసి తెలంగాణ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అంశాన్ని సత్వరమే పరిష్కరించాలని…

ఆసుపత్రి నుంచి అదృశ్యమైన శిశివు ఆచూకీ లభ్యం

గుంటూరు : జిల్లా సమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో ప్రసూతి కోసం వచ్చిన మహిళ శిశువుకు జన్మనిచ్చింది. తెనాలి నుంచి చినరావూరుకు చెందిన వ్యక్తులు ఈ శిశువును అపహరించినట్లు పోలీసులు తెలిపారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు…

నేడు ఢిల్లీకి రాష్ట్రపతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో శీతాకాల విడిదిని పూర్తి చేసుకొని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మంగళవారం ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన బేగం పేట నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  పయనమవుతారు. సోమవారమే గవర్నర్‌తోపాటు సీఎం ఇతర నేతలు రాష్ట్రపతికి…

న్యూయార్క్‌ ఆసుపత్రిలో హిల్లరీ క్లింటన్‌కు చికిత్స

వాషింగ్టస్‌ : రక్తం గడ్డకట్టడంతో న్యూయార్క్‌ ఆసుపత్రిలో చేరిన అమెరికా విదేశంగా శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని చెప్పారు. శరీరంలో రక్తం గడ్డకట్టే లక్షణాలను వైద్యులు గుర్తించడంతో ఆమె…

డివైడర్‌ను ఢీకొన్న బైక్‌ .. ఇద్దరి మృతి

మురళీనగర్‌ , విశాఖ : కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో  వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం నగరంలోని బిర్లా కూడలి వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఇరాక్‌లో బాంబు పేలుళ్లు 22 మంది మృతి

బాగ్దాద్‌ : ఇరాక్‌ మరోసారి రక్తమోడింది. వివిద ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన బాంబు దాడుల్లో 22 మందికిపైగా మృతి చెందారు. 80 మందికిపైగా గాయపడ్డారు. బాగ్డాద్‌, ముస్సేఇబ్‌, హిల్లా, కిర్కుక్‌ , దియాల ప్రాంతాల్లో ఈ దాడులు చోటుచేసుకున్నాయి.…