Monday, 16 November 2026

హైదరాబాద్

నిరుద్యోగుల జీవితంతో ఏపీపీఎస్సీ చెలగాటం

హైదరాబాద్‌: నిరుద్యోగుల జీవితాలతో ఏపీపీఎస్సీ చెలగాటమాడుతోందని దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏపీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది. గవర్నర్‌ తనకున్న అధికారాలను ఉపయోగించి ఏపీపీఎస్సీ సభ్యులను సస్పెండు చేయాలన్నారు.

విద్యార్థులతో చర్చలకు సిద్ధం హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది. వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థులతో చర్చలకు సిద్ధమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎస్‌ సింగ్‌ ప్రకటించారు. అత్యాచారానికి…

విజయమ్మతో కోదండరాం భేటీ

హైదరాబాద్‌: వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాంతోపాటు పలువురు ఐకాస నేతలు భేటీ అయ్యారు. ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష సమావేశంలో వైకాపా తరపున ఒకే అభిప్రాయం చెప్పాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు.

ఆందోళనకు ఆర్మీ మాజీ చీఫ్‌ వీకే సింగ్‌ మద్దతు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చోటుచేసుకున్న అత్యాచార ఘటన బాధాకరమని ఆర్మీ మాజీ చీఫ్‌ వికే సింగ్‌ అన్నారు. ఈ ఉదయం ఆయన ఇండియా గేట్‌ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగిన విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా…

గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యే : దత్తాత్రేయ

హైదరాబాద్‌: మంత్రి ధర్మాన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను వెనక్కి పంపుతూ గవర్నర్‌ నరసింహన్‌ తీసుకున్న నిర్ణయం సరైన చర్యగా భాజపా నేత బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రాజ్యంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. నిరుద్యోగులతో ఆటలాడుకుంటున్న…

షిండేతో సీఎం భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ  పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ అయ్యారు. ఈ నెల 28న నిర్వహించనున్న అఖిలపక్ష భేటీ పై షిండేతో సీఎం చర్చించనున్నారు.

తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ప్రారంభం

హైదరాబాద్‌:తెలంగాణ ధూంధాం దశాబ్ధి ఉత్సవాలు ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ప్రారంమయ్యాయి. ఈ వేడుకల్లో రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాంతో పాటు పలువురు నేతలుపాల్గొన్నారు.

ఆజాద్‌ను కలిసిన ”సీఎం”

న్యూఢిల్లీ : సీఎం కిరణ్‌కూమార్‌ రెడ్డి శనివారం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు. హైకమాండ్‌ పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం హస్తిన పయనం అయిన విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో…

అగ్ని ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ భేటీ

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయంలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సచివాలయంలో భేటీ అయింది. అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు ఇచ్చిన ప్రాథమిక నివేదికను కమిటీ పరిశీలించింది. సోమవారం అర్థరాత్రి విమానాశ్రయంలో…

ఇండియా గేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళన

న్యూఢిల్లీ: వైద్య విద్యార్ధినిపై అత్యాచార ఘటనను నిరిసిస్తూ ఇండియా గేట్‌ వద్ద విద్యార్థులు ఈ ఉదయం చేపట్టిన ఆందోళన కొనసాగుతొంది. భారీ సంఖ్యలో అక్కడికి  చేరుకున్న విద్యార్థులు రాష్ట్రపతి భవన్‌ ముట్టడికి యత్నించారు. పోలీసులు బాష్ప వాయువు గోళాలు,…