Monday, 16 November 2026

హైదరాబాద్

అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌లో విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ హైదరాబాద్‌ యువత ఆందోళననకు దిగింది. అత్యాచార ఘటనకు పాల్పడినవారిని కఠినంగా శిక్షాంచాలని డిమాండ్‌ చేస్తూ నెక్లెస్‌ రోడ్డులో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. నల్ల దుస్తులు ధరించిన విద్యార్థులు ప్రభుత్వానికి…

రూ.10 లక్షల ఎర్ర చందనం పట్టివేత

రాజంపేట : కడప జిల్లా రాజంపేట శివారులో మినీ వ్యాన్‌లో తరలిస్తున్నా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. వాహనం స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.

కరీంనగర్‌ టీడీపీ నేతలతో బాబు భేటీ

కరీంనగర్‌: జిల్లాలో ‘ వస్తున్నా.. మీకోసం’ పాదయాత్ర చేపట్టిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం హుస్నాబాద్‌ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. చంద్రబాబు ఎనిమిదో రోజు పాదయాత్ర…

ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల నిరసన

న్యూఢిల్లీ:దేశరాజధానిలో చోటుచేసుకున్న  అత్యాచార ఘటనను నిరసిస్తూ ఇండియా గేట్‌ వద్ద చేపట్టిన విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది సంఖ్యలో  ఇండియా గేట్‌ వద్ద చేరుకున్న విద్యార్థులు  నిరసన ప్రదర్శనకు దిగి వారిని అడ్డుకున్నారు.  అయితే పోలీసు బారికేడ్లను…

ప్రశాంతంగా ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌

హైదరాబాద్‌: ఆర్జీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు కార్మికులు పెద్దసంఖ్యలో డిపోల ముందు క్యూ కడుతున్నారు. ఈ ఉదయం 5 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైందని.. ఇప్పటి వరకూ ఆయా కేంద్రాల్లో 30…

ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇండియా గేట్‌ వద్దకు ఈ ఉదయం పెద్దసంఖ్యలో చేరుకున్న విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు పాల్పడిన వారికి ఉరిశిక్ష అమలు చేయాలని…

ఢిల్లీ ఘటనలో ఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో ఆరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఔరంగాబాద్‌లో నిందితున్ని పట్టుకోని ఢిల్లీకి తరలించినట్లు చెప్పారు. అయితే నిందితుని వివరాలు వెల్లడించేందుకు…

టీఎంయూ సభ్యులపై ఎన్‌ఎంయూ దండుదాడి

మహబూబ్‌నగర్‌: జిల్లాలోని వనపర్తి బస్టాండ్‌ వద్ద తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సభ్యులపై ఎన్‌ఎంయూ దండు దాడికి దిగింది. పోలీసులు లాఠీచార్జ్‌ చేసి వారిని వెళ్లగొట్టారు. ఈ ఘటనలో టీఎంయూ కార్యకర్తలకు తీవ్రగాయాలైనట్లు సమాచారం, ఓడిపోతామనే కక్ష్యతోనే ఈ దాడులకు…

ఢిల్లీ వెళ్లిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 28 జరగనున్న అఖిలపక్ష సమావేశంతో పాటు ధర్మన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్ఠాన పెద్దలతో చర్చిస్తారని సమాచారం వీటితో పాటు…

కాకతీయ కెనాల్‌లో స్కూల్‌ బస్సు బోల్తా

కరీంనగర్‌: జిల్లా కేంద్రానికి సమీపంలోని అలగనూరు చౌరస్తా దగ్గర కాకతీయ కెనాల్‌లో స్కూలు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌ మృతి చెందగా ఆరుగురు విద్యార్థలకు తీవ్రగాయాలయ్యాయి.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా…