Monday, 16 November 2026

హైదరాబాద్

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

హైదరాబాద్‌ : ప్రతిపాదిత బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో భాగంగా బ్యాంకుల విలీనం, ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించే చర్యలను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు…

భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టీ 20 నేడే

పుణె : టీ 20 సిరీస్‌లోభాగంగా భారత్‌, ఇంగ్లండ్‌లు గురువారం తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ దీనిలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. టీ 20ల్లో ఆరితేరిన చాలామంది కుర్రాళ్లుండడం, కొందరు టెస్టు జట్టులో…

నేడు హైదరాబాద్‌లో తెలంగాణ మహాసదస్సు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల కళింగభవన్‌లో నేడు తెలంగాణ మహా సదస్సు జరుగుతుంది. దీనికి పలువురు తెలంగాణ పార్టీల నాయకులు హాజరుకానున్నారు.

ప్రైవేటు బస్సు బోల్తా : 12 మందికి గాయాలు

యర్రగొండపాలెం : హైదరాబాద్‌ నుంచి కనిగిరి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్‌ బస్సు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని బోయినపల్లి మూల మలుపు వద్ద గురువారం ఉదయం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను యర్రగొండపాలెం…

అస్వస్థతకు గురైన హాస్టల్‌ విద్యార్థులు

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు బుధవారం రాత్రి మాంసాహారం భుజించారని, అందువల్లే అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు.…

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం అయింది. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.గుజరాత్‌లో 1,666 అభ్యర్థులు, హిమాచల్‌ప్రదేశ్‌లో 459 మంది…

గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా దూసుకువెళుతున్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోడీకి ఓటర్లు పట్టం కట్టారు. మణినగర్‌…

రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు

హైదరాబాద్‌: కూకట్‌పల్లి, నిజాంపేట్‌, భాగ్యనగర్‌ కాలనీలో రియల్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. కార్పొరేటర్‌ సామ్రాజ్యం, రియల్టర్లు గాంధీ, సుబ్బయ్య, కోటేశ్వర్‌రావు ఇళ్లలో ఐటీ సోదాలు జరిపింది.

విమలక్కను విడుదల చేయాలి: మధుయాస్కీ

ఢిల్లీ: టఫ్‌ కోకన్వీనర్‌, అరుణోదయ విమలక్కను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గజ్జే కట్టి గళం విప్పిన విమలక్కను మూడు నెలలుగా జైల్లో బంధించండం దారుణమన్నారు.

అగ్నిప్రమాదంపై త్వరలోనే నివేదిక: కృష్ణారావు

హైదరాబాద్‌: బేగంపేట విమానాశ్రయం ఓ సంభవించిన అగ్నిప్రమాదంపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక సమర్పిస్తామని విచారణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణారావు తెలిపారు. ఈరోజు ఆయన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. విచారణ కమిటీ అధికారులు ఈరోజు విమానాశ్రయ ప్రాంగణాన్ని కూలంకషంగా గాలించారు. ఆధారాలకోసం…