Monday, 16 November 2026

హైదరాబాద్

నాటు తుపాకీతో కాల్చుకుని ఇద్దరి మృతి

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకి కాల్చుకుని ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శివమ్మలు మృతిచెందారు. తమ అక్రమ సంబంధం భర్తకు…

జగన్‌ బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో రెండోరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడుల కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారమే వాదనలు విన్న…

75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

పాలనకు పట్టం కట్టారు : నరేంద్రమోడీ

గాంధీనగర్‌ : గుజరాత్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రజలు తిరిగి పట్టం కట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిండంపై ఆయన  .

మోడీ విజయంపై స్పందించని నితీష్‌

పాట్నా : గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ విజయంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎన్డీయే అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న భాజపాలోని కొందరి ప్రతిపాదనలపై జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని అభ్యర్థిగా మోడీ అర్హుడు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ అర్హుడని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ గుజరాత్‌ ప్రజలు మోడీకి అండగా నిలిచారని అన్నారు.

భాజపాకు సీట్ల సంఖ్య తగ్గింది : చిదంబరం

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో భాజపాకు సీట్ల సంఖ్య తగ్గిందని కేంద్ర ఆర్థికశాఖమంత్రి చిదంబరం అన్నారు. గతంలో ఆ పార్టీకి 117 స్థానాలుండగా ప్రస్తుత ఎన్నికల్లో ఆ స్థానాల సంఖ్య తగ్గనుందని ఆయన వెల్లడించారు.

సామాన్యులకు అభివృద్ధిఫలాలు చేరాయి : దత్తాత్రేయ

హైదరాబాద్‌ : గుజరాత్‌లో మోడీ నాయకత్వంలోని భాజపా పాలనలో అభివృద్ధి ఫలాలు సామాన్యులకు చేరాయని భాజపా నేత బండారు దత్తాత్రేయ అన్నారు. దీంతో ప్రజలు తిరిగి భాజపాకు పట్టం కట్టారని పేర్కొన్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ గెలుపుదిశగా పయనిస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ తదుపరి రౌండ్లలో కాంగ్రెస్‌ దూసుకుపోయింది. మొత్తం 68 స్థానాల్లో కాంగ్రెస్‌ 35, భాజపా 24 స్థానాల్లో ఆధిక్యంలో…

బస్సు బోల్తా : 45 మంది అయ్యప్ప భక్తులకు గాయాలు

బిచ్కుంద : నిజామాబాద్‌ జిల్లా కందర్‌పల్లి వద్ద గురువారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న ఓ బస్సు బోల్తాపడింది. ఈ ప్రయాణంలో 45 మంది అయ్యప్పభక్తులు గాయపడ్డారు. బాధితులను చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం సీతారాంపేట వాసులుగా గుర్తించారు.…