Monday, 16 November 2026

హైదరాబాద్

ఎమ్మార్‌ కేసులో ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వులో

న్యూఢిల్లీ : ఎమ్మార్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంలో న్యాయప్రాధికార సంస్థముందు వాదనలు ముగిశాయి, అయితే ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంపై తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వులో ఉంచింది. ఈడీ, ఎమ్మార్‌ కౌంటర్లపై లిఖిత పూర్వక సమాధానాలు ఇవ్వాలని న్యాయప్రాధికార సంస్థ…

కేంద్ర హోంమంత్రికి కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో వ్యవహరించి అఖిలపక్షం నిర్వహించాలని లేఖలో ఆయన కోరారు. సమావేశానికి సోనియా, చంద్రబాబు, వైఎస్‌ విజయ హాజరయ్యేలా  చర్యలు తీసుకోవాలన్నారు.

జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్‌ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు ఉదయం ఈ కేసును మధ్యాహ్ననికి వాయిదా వేసిన న్యాయస్థానం తిరిగి రేపటికి వాయిదా వేసింది.

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు యశ్‌వీర్‌ కేంద్రమంత్రి నారాయణస్వామి నుంచి కోటా బిల్లు ప్రతిని లాగేసుకున్నారు. ఆయన నుంచి బిల్లు ప్రతిని తిరిగి తీసుకునేందుకు సోనియా ప్రయత్నించారు. సోనియాకు అందకుండా యశ్‌వీర్‌…

నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జగన్‌, గాలి జనార్దన్‌రెడ్డి సహా నిందితులందరికీ సీబీఐ న్యాయస్థానం జనవరి రెండు వరకు రిమాండ్‌ పొడిగించింది. ఈ కేసుల్లో నిందితులను ఈ రోజు న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా విచారించింది.

ఇద్దరు ఐఏఎన్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: ఇద్దరు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా సునీల్‌ శర్మ, వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక కమిషనర్‌గా హర్‌ప్రీత్‌సింగ్‌ నియమితులయ్యారు.

ముని-3 చిత్రీకరణ ప్రారంభం

హైదరాబాద్‌: ముని, కాంచన వంటి హారర్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన లారెన్స్‌ వాటికి సీక్వెల్‌గా ముని-3 మొదలు పెట్టారు. ఈ చిత్రం చిత్రీకరణ రోజు అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించారు. లారెన్స్‌, తాప్సీలపై  ముహూర్తపు…

అఖిల పక్ష సమావేశానికి తప్పకుండా వెళ్తాం : భాజపా

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ నిర్ణయంపై ఢిల్లీలో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా వెళ్లనున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శ వీరారెడ్డి చెప్పారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ సమావేశం ఇవాళ ఆ పార్టీ…

బోర్డు తిప్పేసిన ఐరావత్‌ ఫైనాన్స్‌

విశాఖపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఐరావత్‌ ఫైనాన్స్‌ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దాంతో 150 మంది బాధితులు ఆందోళన చేపట్టారు. సుమారు రూ. 15 కోట్లకు పైగా డబ్బు ఈ ఫైనాన్స్‌ సంస్థ ఎగవేసినట్లు భావిస్తున్నారు.