Sunday, 15 November 2026

హైదరాబాద్

తెలంగాణలో పంటనష్టంపై సమగ్ర సర్వే నిర్వహించాలి: కేటీఆర్‌

హైదరాబాద్‌: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను అదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందపి తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ విమర్శించారు. ఏడాదిన్నర కిందిట అందాల్సిన పరిహారం రైతులకు ఇప్పటికీ ఇవ్వలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఎమిటో తెలుస్తోందని తెలంగాణ భవన్‌లో  మీడియాతో మాట్లాడుతూ అన్నారు.…

తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉంది: షిండే

న్యూఢిల్లీ: దేశానికి తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ముంబయి. దాడుల కేసులో కీలక నిందితులు పొరుగు దేశంలో ఉన్నారని అందరికీ తెలుసునని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.

వర్షాలకు 26 మంది మృతి : భారీగా పంట నష్టం

హైదరాబాద్‌ : నీలం తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలకు పలు కోస్తాంధ్ర జిల్లాలతోపాటు ఇతర జిల్లాల్లో నష్టం భారీగా జరిగింది. పంటనష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారులు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.…

నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు

కర్నూలు: వెంగన్నబావి వద్ద నకిలీ విత్తనాల తయారీని విజిలెన్స్‌ అధికారులు గుట్టురట్టు చేశారు. విత్తన గోదాముల్లో తనిఖీలు నిర్వహించి లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. గోదాముల నిర్వాహకులపై కేసులు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.

పంట నష్టపరిహారం కోసం టీఆర్‌ఎస్‌ ధర్నా

నల్లగొండ: నీలం తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లంచాలని టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ధర్నా చేస్తున్నారు. ఎకరలకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ వ్యక్తం చేస్తున్నారు.

అత్యాచారం ఘటనలో నిందితుడి వూహాచిత్రం విడుదల

ముంబయి: విదేశీ మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో అనుమానితుడి వూహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. బాంద్రాలో ఉంటున్న ఓ స్పానిష్‌ మహిళ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం విలువైన…

వైద్యం వికటించి బాలుడి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్‌లోని ఓ ప్రైవేట్‌ అసుపత్రిలో వైద్యం వికటించి పదేళ్ల బాలుడు మృతి చెందాడు.మృతుని బందువులు అసుపత్రి ఎదుట అందోళన చేస్తున్నారు.

వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయింది: రఘువీరారెడ్డి

విజయవాడ: ఈశాన్య రుతుపవానలకు సంబంధించి వాతావరణశాఖ పూర్తి సమాచారం ఇవ్వలేకపోయిందని మంత్రి రఘువీరారెడ్డి వెల్లడించారు. గన్నవరం మండలం కేసరపల్లి వద్ద నీటమునిగిన పొలాలను కలెక్టర్‌ బుద్దప్రకాష్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఈశాన్య రుతుపవనాలను…

దిల్‌షుఖ్‌ నగర్‌ వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ

హైదరాబాద్‌ : దిల్‌షుక్‌నగర్‌లోని వెంకటేశ్వరస్వామి అలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి అలయంలోకి ప్రవేశించి సుమారు 3 కేజీల వెండి అభరణాలను అపహరించారు. ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బలహీనపడిన అల్పపీడనం

విశాఖపట్నం: ఉత్తర కోస్తాలో అవరించి ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని విశాఖ వాతవారణ శాఖ తెలిపింది, వీటి ప్రభావంతో పలుచోట్ల చిరుజల్లులు, ఒకటీ రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతవారణ శాఖ అధికారులు తెలియజేశారు.