Friday, 13 November 2026

హైదరాబాద్

పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాల ధర్నా

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల చివరి రోజున పార్లమెంట్‌ ఆవరణలో విపక్షాలు ధర్నాకు దిగాయి. భాజపా నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌ తదితరులు ఈ ధార్నలో పాల్గొన్నారు. నైతిక బాధ్యత వహించి ప్రధాని రాజీనామా చేయాలని నేతలు…

సుమన్‌ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌: అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థవదేహం వద్ద పూలమాల ఉంచి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ…

ఉన్నత ప్రమాణాలతో కృషి చేసిన వ్యక్తి సుమన్‌: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఈటీవీ స్థాపన, విస్తరణలో ఉన్నత ప్రమాణాలతో విశేష కృషి చేసిన వ్యక్తి సుమన్‌ అని ఆయన అన్నారు.ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 287 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 86 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

నేడు టీవీ షూటింగ్‌ల నిలిపివేత

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ టీవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. ఆయన మృతికి సంతాపంగా ఇవాళ అన్ని టీవీ షూటింగ్‌లు నిలిపివేసినట్లు సంఘం ప్రతినిధులు తెలియజేశారు.

సుమన్‌ మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్‌

ఢిల్లీ: రామోజీరావు రెండవ కుమారుడు సుమన్‌ (45) మృతి పట్ల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సమన్‌ చిత్రకారుడుగా పలు సేవలు అందించాడని ఆయన కొనియాడారు. మంచి రచయితను కోల్పోయామని తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తన సంతాప…

సుమన్‌ భౌతికకాయానికి నివాళులు అర్పించిన నారాయణ

హైదరాబాద్‌: సుమన్‌ మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంతాపం తెలియజేశారు. రామోజీఫిల్మ్‌సిటీలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సుమన్‌ పార్థివదేహానికి తెదేపా ఎంపీ సుజనాచౌదరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి నివాళులు అర్పించారు.

నేటి నుంచి పాక్‌లో ఎన్‌.ఎం కృష్ణ పర్యటన

న్యూఢిల్లీ: భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.ఎం కృష్ణ పాకిస్థాన్‌లో నేటి నుంచి పర్యటించనున్నారు. మూడు రోజులపాటు చేపట్టనున్న ఈ పర్యటనలో శనివారం పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి హీనారబ్బానీఖర్‌తో ఇస్లామాబాద్‌లో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

మేఘాలయలో స్వల్ప భూకంపం

షిల్లాంగ్‌: మేఘాలయలో స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలియజేశారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ 4.2గా నమోదైనట్లు అధికారులు తెలియజేశారు.

ఉద్థృతంగా ప్రవహిస్తున్న గోదావరి

మహదేవ్‌పూర్‌: కరీంనగర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళ్లేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నిన్న రాత్రి నుంచి వరద ఉద్థృతి పెరుగుతుండటంతో మండలంలోని 20 గ్రామలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పత్తి, వరి పంటలు నీట మునిగాయి. లొతట్టు ప్రాంతాలకు…