Wednesday, 11 November 2026

హైదరాబాద్

ఎంజీఎంలో నాలుగు రోజుల పాప మృతి

వరంగల్‌: వెంటిలేటర్‌ అందుబాటులో లేకపోవడంతో వరంగల్‌లోని ఎంజీఎంలో నాలుగు రోజుల చిన్నారి ఈ రోజు ఉదయం మృతిచెందింది. దీంతో ఆగ్రహిచిన తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పాప మృతిచెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటిలేటర్‌…

నేడు గాంధీభవన్‌లో నేడు ‘ క్రాంతి దివన్‌’

హైదరాబాద్‌: ‘క్విట్‌ ఇండియా’ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఈరోజు ‘ క్రాంతి దివన్‌’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ తదితరులు హాజరుకానున్నారు.

యాసిడ్‌ దాడిలో యువకుడి మృతి

విశాఖపట్నం: ఎలమంచిలి మండలం పురుషోత్తపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు చెట్టుకు కట్టేసి యాసిడ్‌ పోశారు. ఈ దాడిలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురు గంజాయి దొంగల పరారీ

విశాఖ: పాడేరు ఎక్సైజ్‌ పోలీస్టేషన్‌ నుంచి ఈరోజు ముగ్గురు గంజాయి దొంగలు పరారయ్యారు. రెండో రోజుల క్రితం ఒడిశాకు అక్రమంగా గంజాయి తరలిస్తూ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడిన ముఠాలో వీరు సభ్యులు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

నేడు ఇంజనీరింగ్‌ కళాశాలల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: బోథనా రుసుం విధానాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇంజనీరింగ్‌ ఫీజుల విధివిధానాలపై మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసేవిగా ఉన్నాయని విద్యార్థి…

ఖమ్మం జిల్లాలో సీఎం రెండోరోజు ఇందిరమ్మబాట

ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండోరోజు పర్యటించనున్నరు. బుధవారం మొదటిరోజు పర్యటన అనంతరం సున్నంవారిగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల వసతిగృహంలో రాత్రి బస చేశారు. ఈరోజు ఇందిరమ్మబాటలో భాగంగా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయం నుంచి …

టెస్ట్‌ రిటైర్మంట్‌పై వార్తలను తోసి పుచ్చిన కెవిన్‌ పీటర్స్‌న్‌

ప్రసుత్తం దక్షిణప్రికాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌ అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటించనున్నట్లు వసున్న వార్తలను ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కెవిన్‌ పీటర్స్‌న్‌ తోసిపుచ్చునూ లేదు సమర్థించనూ లేదు.దీంతో ఆయన రిటైర్మంట్‌పై గందరగోళ పరిస్థితి నెలకోంది. ప్రసుత్తం జరుగుతున్న మూడో టెస్ట్‌…

సాహితీరత్నం ‘సదాశివ’!

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): తెలంగాణ సాహితీ మాగాణంలో విరబూసిన పూవు.. సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఒక మెరుపును సృష్టించుకున్న నిరాడంబరుడు సదాశివ మాస్టారు. భావి తరాలకు ఆయన ఆదర్శనీయుడు. ఆయన చేతి నుంచి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పుస్తకాలు…

ఉపసంఘం సిఫార్సులు అభ్యంతరకరం : వీహెచ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి): బిసి విద్యార్థులకు ఫీజు చెల్లింపుల్లో కోత విధించాలన్న మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులను కాంగ్రెస్‌ సినియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుపట్టారు. బుధవారం నాడు ఆయన ఇక్కడ మీడియాతో ముచ్చటించారు. ఆది…

బీసీ మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదు

ఉపముఖ్యమంత్రి రాజనరసింహ హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి): ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మంత్రి వర్గ ఉపసంఘం చేసిన సిఫార్సుల పట్ల బిసి మంత్రుల ఆవేదనలో తప్పేమీ లేదని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు.…