Wednesday, 11 November 2026

హైదరాబాద్

దగ్ధమైన బోగి హైదరాబాద్‌కు తరలింపు

నెల్లూరు: నెల్లూరులో గత నెల 31న దగ్ధమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌11 బోగిని ఫోరెన్సిక్‌ నిపుణుల సూచనల మేరకు గురువారం హైదరాబాద్‌ తరలించారు. ప్రమాదానికి గల కారణాలు వాటి వివరాలు సేకరించేందుకు దీనిని తీసుకెళ్లారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం: సీఎం

హైదరాబాద్‌: వ్యవసాయ యంత్రాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఆయన పినపాక మండలం ఐలాపురంలో రూ. 700 కోట్ల అభివృద్ధి వసులకు శంకుస్ధాపన చేశారు. అనంతరం…

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు సన్నాహాలు

హైదరాబాద్‌: ఎట్టకేలకు ప్రభుత్వం ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌కు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 19 నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఈ నెల 10వ తేదిన నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

నకిలీ పాసుల వ్యవహారంలో ఆర్టీసీ మాజీ ఉద్యోగులు

హైదరాబాద్‌: నకిలీ పాసుల తయారీలో కొంత మంది ఆర్టీసీ మాజీ ఉద్యోగుల ప్రమేయం ఉందని ఎండీ ఏకే ఖాన్‌ తెలియజేశారు. ఇటివల నకిలీ పాసులతో పట్టుబడిన 290 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. నకీలి పాసులతో…

ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలి -కోదండరెడ్డి

హైదరాబాద్‌: రైతులకు విద్యుత్‌ సరఫరా విషయంలో ట్రాన్స్‌కో, డిస్కంలు పద్దతి మార్చుకోవాలని పీసీసీ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్నది ప్రభుత్వ నిర్ణయమని అయితే రైతులకు అనుకూల సమయంలో కాకుండా రాత్రిళ్లు విద్యుత్‌…

జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టీవీ సంస్థలకు జరిమానా

హైదరాబాద్‌: జగతి, జననీ ఇన్‌ఫ్రా, ఇందిరా టెలివిజన్‌ సంస్థలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మూడు సంస్థలకు  రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఒక్కోదానికి రూ లక్ష చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది. బ్యాంకు…

ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలపై చర్చ

హైదరాబాద్‌: సెప్టెంబరులో జరిగే ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి మాత్రమే చర్చిస్తామని మంత్రి రఘువీరా తెలియజేశారు. గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ప్రపంచ గిరిజన ఆదివాసి దినోత్సవాన్ని మంత్రులు  రఘువీరా, శైలజానాధ్‌లు ప్రారంభించారు.…

సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు

ఖమ్మం: ఇందిరమ్మ బాటలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని హాస్టల్‌లలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ పినపాక మండలం ఎల్బీరెడ్డిపల్లెలో సీఎం కాన్వాయ్‌ని హాస్టల్‌ విద్యార్థులు అడ్డుకున్నారు. ఈరోజు ఆయన ప్రయణిస్తోన్న వాహనశ్రేణిని విద్యార్థులు…

సింగరేణి బొగ్గుగని లో ప్రమాదం

ఒకరి మృతి ఇద్దరికి గాయాలు రామగుండం; సింగరేణి రామగుండం రిజియన్‌ లోని 2ఏ బొగ్గుెగని లో బుధవారం మధ్యహ్నం 2గంటలకు సమయంలో ప్రమాదం జరిగింది. బొగ్గును కట్‌ చేస్తుంన్నండగా ప్రక్క గోడ కుప్ప కూలడంతో జరిగిన ప్రమాదం కలెక్టరేట్‌…

అసెంబ్లీ హాలులో పీఏసీ సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాలులో ప్రజాపద్దుల కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి అదిత్యానాథ్‌ దాస్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌లు హాజరు కాకపోవడంపై పీఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకూర్తి అక్రమాలపై…