Wednesday, 25 November 2026

సీమాంధ్ర

అంతర్జాతీయ స్మగ్లర్ కందస్వామి అరెస్ట్

కడప : అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న అంతర్జాతీయ స్మగ్లర్ పార్తీబన్ కందస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 638 కిలోల బరువు ఉన్న 21…

హైకోర్టు విభజనకు అభ్యంతరం లేదు

విజయవాడ: విభజన చట్టంలోని సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర హోంశాఖదేనని కేంద్రమంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై తమకెలాంటి అభ్యంతరం లేదని మంత్రి స్పష్టం చేశారు. హైకోర్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కేంద్రం…

రైలుపట్టాలపై కూలిన ప్రహరీ

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై రక్షణ గోడ కూలి పడింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఉన్న రక్షణ గోడ బాగా నానడంతో సోమవారం అర్థరాత్రి ఆ…

హెర్నియా అని వస్తే…గర్భసంచి..!

కుప్పం(చిత్తూరు) :హెర్నియా చికిత్సకు వచ్చిన ఓ యువకుడి కడుపులో గర్భసంచి బయటపడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. వివరాలివీ.. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా చిట్టిపల్లికి చెందిన అమర్నాథ్(23) కొన్ని రోజులుగా హెర్నియా(బుడ్డ)తో బాధపడుతున్నాడు. అతడు గురువారం…

మంగళగిరిలో ఆప్కోశాఖ రాష్ఠ్ర కార్యాలయం ప్రారంభం

గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆప్కోశాఖ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి కొల్లు రవీంధ్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌, ఆప్కో చైర్మన్‌ హనుమంతరావు, మంగళగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గంజి చిరంజీవి, అధికారులు, టీడీపీ కార్యకర్తలు…

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ సీ34

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రోదసీలో మరో చరిత్ర సృష్టించింది. ఒకే రాకెట్‌ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి సత్తా చాటింది. బుధవారం ఉదయం 9.26గంటలకు నెల్లూరు…

బాలికపై అసభ్య ప్రవర్తన

గుంటూరు: గుంటూరు జీజీహెచ్‌లో బాలికపై ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు గమనించి యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని పాతగుంటూరు వాసిగా గుర్తించారు. అతడు గతంలోనూ పలువురు బాలికలు, యువతుల పట్ల అసభ్యంగా…

రుణప్రణాళికలో లోపించిన చిత్తశుద్ది

విజయవాడ,జూన్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ ముంచుకొస్తున్నా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని వ్యవసాయ కార్మిక సంగం ఆరోపిస్తోంది. రైతులు సాగు చేయాలంటే వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, సలహాలు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది…

పేకాట కేంద్రంపై దాడులు.. ఆరుగురు అరెస్ట్

ఆత్మకూరు: మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామంలో ఓ పేకాట కేంద్రంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారి నుంచి రూ.3,550 నగదు, మూడు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్లను…

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

అనంతపురం : అనంతపురం జిల్లా యాడికి మండలం వేములపాడు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దంపతులు వెళ్తున్న బైక్ను ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు ఓబులేష్, ఈశ్వరమ్మ అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే…