Wednesday, 25 November 2026

సీమాంధ్ర

మామను కొట్టి చంపిన అల్లుడు

 నల్గొండ, సెప్టెంబరు 10 : మేళ్లచెర్వులో మామను రోకలిబండతో అల్లుడు కొట్టి చంపాడు. తరచూ మద్యం తాగి మనమరాలిని వేధిస్తుండటంతో ఆగ్రహించిన అల్లుడు మామను కొట్టి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కార్పొరేషన్‌లో నిధుల గోల్‌మాల్

గుంటూరు, సెప్టెంబర్ 10 : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.కోటి నగదు గోల్‌మాల్ జరిగింది. ఏడాది కాలంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ.కోటి ఆస్తి పన్నును కొందరు సిబ్బంది నొక్కేశారు. ఇటీవల బయటపడిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం…

అనంతపురంలో రైతు ఆత్మహత్య

అనంతపురం, సెప్టెంబర్ 10 : ఆర్థికపర ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా యాడికి మండలం రాయలచెరువులో అప్పులబాధతో రైతు బాలరంగడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి

టీడీపీతోనే నదుల అనుసంధానికి నాంది

గుంటూరు,  దేశంలో నదుల అనుసంధానికి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాంది పలికింది. గో దావరి జీవనదిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదితో అనుసంధానం చేసింది. దీని వలన రాష్ట్రంలో కరువు అనేది ఉత్పన్నం కాకుండా పోతుందని తెలుగుదేశం…

లారీ -ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ:20 మందికి గాయాలు

కృష్ణా : జిల్లా పెనుగంచి ప్రోలు మండలం నవాబుపేట వద్ద జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను నందిగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…

దారి విషయంలో గొడవ…మహిళ ఆత్మహత్య

నెల్లూరు, సెప్టెంబర్ 9 : అనంతసాగరం ఎస్టీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. దారి విషయంలో గొడవ ఓ మహిళ ప్రాణాలను బలితీసుకుంది. దాడి విషయంలో గొడవ సందర్భంగా పొరుగింటి మహిళలు దురుసుగా మాట్లాడటంతో మనస్థాపం చెందిన రత్తమ్మ…

హాస్టల్‌లో పీడీ కొడుతున్నారని ఇళ్లకు వెళ్లిపోయిన విద్యార్థులు

విశాఖ, సెప్టెంబరు 9 : పెదబయలు ఎస్టీ హాస్టల్‌లో ఫిజికల్‌ డైరెక్టరు కొడుతున్నారని 300 మంది విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. హాస్టల్‌లోని బ్లాక్‌బోర్డుపై రాసిన విద్యార్థులు హాస్టల్‌ వదిలి వెళ్లారు. ఈ ఘటనపై ఎస్టీ శాఖాధికారులు దర్యాప్తు చేస్తామన్నారు.

కుటుంబకలహాలతో ఆరునెలల గర్భిణి ఆత్మహత్య

కర్నూలు, సెప్టెంబరు 9 : కోడుమూరు మండలం తంబుకనగర్‌లో దారుణం జరిగింది. కుటుంబకలహాలతో ఆరు నెలల గర్భిణి రుక్సానా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తంబుకనగర్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల వైఖరిపై నీళ్లట్యాంకుపైకి ఎక్కి నిరసన

పశ్చిమగోదావరి, సెప్టెంబరు 9 : నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో తనపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ రాజేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి నీళ్లట్యాంకు పైకి నిరసన తెలిపారు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన రాజేంద్రప్రసాద్‌ను…

విజయవాడ రహదారిపై ప్రమాదంలో 15 మందికి గాయాలు

కృష్ణా, సెప్టెంబరు 9 : విజయవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై నవాబ్‌పేట్‌ దగ్గర ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడి న…