Wednesday, 25 November 2026

సీమాంధ్ర

సింహ వాహనంపై గోవిందరాజస్వామి

తిరుమల:తిరుమలలో గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు గోవిందరాజస్వామి సింహ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందరాజస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామివారు ముత్యపు…

వేధింపులతో వివాహిత ఆత్మహత్య..

తూర్పుగోదావరి : రాజమండ్రిలో కొంతమూరులో దారుణం చోటు చేసుకుంది. వివాహితను అసభ్యకరంగా చిత్రీకరించి నాగు అనే వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో వేధింపులకు తాళలేక ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

తిరుమలలో పెరిగిన రద్దీ..

చిత్తూరు : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్వనానికి 16గంటల సమయం పడుతుండగా నడక దారిన వచ్చే వారికి సుమారు ఐదు గంటల సమయం పడుతోంది.

నేడు కుప్పంలో సీఐటీయూ భారీ బహిరంగ సభ…

తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు కుప్పంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు సీపీఎం నేత గఫూర్ హాజరు కానున్నారు.

సీనియర్ నటి బిందు మాధవి కన్నుమూత…

ఒంగోలు: సీనియర్‌ నటి బిందుమాధవి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆమె మృతికి మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌ సంతాపం తెలిపింది. గతంలో ఆమె వైద్యానికి కాదంబరి కిరణ్‌ సాయం అందజేశారు. పలు…