తిరుపతి:పారిశ్రామికంగా ఏపీని నెంబర్ వన్ చేస్తాంమని ఏపీసీఎం చంద్రబాబు అన్నారు. సత్యవేడు శ్రీసిటీ సెజ్ లో 11 దేశ, విదేశీ కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెప్సీకో తమ ఉత్పత్తులకు అవసరమైన ముడి పదార్థాలను ఇక్కడి రతైలు నుంచే కొనుగోలు చేయాలని తెలిపారు. పరివ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. రూ.1200 కోట్లతో ఏర్పాటు కానున్న పెప్సీకో ప్లాంటు ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తామని పెప్సీకో సీఈవో ఇంద్రనూయి తెలిపారు. సత్యవేడు ప్లాంటను మరింత విస్తరిస్తామని ఇంద్ర నూయీ స్పష్టం చేశారు.




