Tuesday, 3 November 2026

తణుకులో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..

 పశ్చిమగోదావరి : జిల్లాలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. తెనాలి నుండి విశాఖపట్టణం వెళుతున్న (ఎపి07 జెడ్ 0086) ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. దీనితో ఆర్టీసీ బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయైంది. తణుకు మండలం దువ్వ బైపాస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *