Wednesday, 25 November 2026

సీమాంధ్ర

పాపాయపాలెంలో పోలీసుల సోదాలు..

గుంటూరు : బెల్లకొండ మండలం పాపాయపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు. గ్రామీణ ఎస్పీ నారాయణనాయక్ ఆధ్వర్యంలో ఇంటింటిలో సోదాలు చేశారు. నాటు బాంబుల పేలుడు..వేట కొడవళ్ల లభ్యం ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

హెడ్మాస్టర్ ఇంట్లో పేలిన నాటు బాంబు

గుంటూరు:జిల్లాలోని బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో రిటైర్డు హెడ్మాస్టర్‌ ఇంట్లో నాటుబాంబులు పేలాయి. ఈ నేపథ్యంలో సాయుధ పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పోలీసులు గ్రామంలో ఇంటింటిని తనిఖీలు చేస్తుండటంతో గ్రామస్థులు భయాందోళనలు చెందారు.

విశాఖలో ఏప్రిల్ 8నుంచి కామన్ వెల్త్ సదస్సు

విశాఖపట్నం: నగరంలోని నోవాటెల్ హోటల్లో ఈ నెల 8వ తేదీ నుంచి కామన్వెల్త్ పార్లమెంట్ కమిటీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 8, 9వ తేదీలు విశాఖలోనే ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ ముగింపు సమావేశాలు మాత్రం అరకులో జరగనున్నాయి.…

ఆత్మకూరులో భారీ చోరీ

నెల్లూరు: ఆత్మకూరు బజార్ సెంటర్ లో భారీ చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం బంగారు షాపు షట్టర్ తెరుస్తుండగా వ్యాపారి బ్యాగ్ ను ఇద్దరు దుండగులు అపరహరించారు. ఆబ్యాగ్ లో రూ.50 లక్షల విలువైన బాధితుడు పీఎస్…

ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా

కడప: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పదవికి మేడా మల్లికార్జునరెడ్డి రాజీనామా చేశారు. కడప ఒంటిమిట్టలో  జరిగిన రాములోరి కల్యాణ వేడుకల్లో అధికారులు తనను అవమానించారని ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. దేవాలయ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన తన…

ప్రతినెల ఒకరోజు జీతం ఇవ్వాలి…

హైదరాబాద్ :  ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఉద్యోగులు ‘ప్రతి నెల ఒక రోజు జీతం రాజధానికి ఇవ్వాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.   ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ప్రతినెలా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు…

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణెత్సవం

హైదరాబాద్‌: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణెత్సవం ఈరోజు వైభవంగా జరగనుంది. ఇవాళ రాత్రి 8 నుంచి 11 గంటల వరకు ఈ కల్యాణెత్సవం ప్రభుత్వ లాంఛనాలతో కన్నులపండువగా జరుగనుంది. కల్యాణెత్సవంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు…

‘అనంత’లో ప్రైమరీస్కూల్ హెడ్మాస్టర్ దాష్టీకం…

అనంతపురం: జిల్లాలోని నేత్రపల్లి ప్రైమరీస్కూల్ హెడ్మాస్టర్ ఓ విద్యార్థిపై వీరంగం సృష్టించాడు. అల్లరిచేస్తున్నాడని ఒకటో తరగతి విద్యార్థి చరణ్(5)ను హెడ్మాస్టర్ బషీర్ అహ్మద్ చితకబాదాడు. దీంతో విద్యార్థికి తలపై బలమైన గాయయింది. బాలున్ని రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

‘అనంత’లో ఎస్సై రామయ్య కీచకపర్వం..

అనంతపురం: జిల్లా కేంద్రంలో ఎస్సై రామయ్య కీచకపర్వం కొనసాగింది. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై రామయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు…