Tuesday, 24 November 2026

సీమాంధ్ర

నెల్లూరుకు క్షేమంగా చేరుకున్న నలుగురు యాత్రికులు

నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లాకు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు నలుగురు ఈరోజు సురక్షితంగా చేరుకున్నారు. మరో నలుగురు నెల్లూరు వాసులు బద్రీనాథ్‌లో ఉన్నట్లు సమాచారం అందింది.

స్తంభించిన కాకినాడ లంగారు రేవు కార్యకలాపాలు

సర్పవరం జంక్షన్‌: కార్మికుల సమ్మెతో తూర్పుగోదావరిలోని కాకినాడ లంగరు రేవు (యాంకరేజ్‌ పోర్టు)లోని వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. రేవులోని బ్యాడ్జీల యజమానులకు, కార్మికులకు తలెత్తిన వివాదంలో మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్‌రెడ్డి జోక్యాన్ని నిరసిస్తూ ఈరోజు కార్మికులు…

ఎలుగు బంటి దాడికి గురైన ఓ యువకుడు

యర్రగొండపాలెం పట్టణం: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని నల్లమల అడవుల్లో నెక్కెంటి సమీపాన ఓ ఎలుగు బంటి  యువకుడిపై దాడి చేసి గాయపరిచింది. గుట్టలచేసుకు చెందిన కుడుముల పోతురాజు అనే యువకుడు తన బంధువుల వద్ద వెళ్లి వస్తుండగా…

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డా ఓయువకుడు

చిత్తూరు : పాలసముద్రం మండలం బీవీఎస్‌ఆర్‌పురంలో దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పొలం నుంచి ఇంటికి వస్తున్న బాలికను అడ్డగించి యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిక ఘటనాస్థలిలోనే మృతి చెందింది.…

దుండగులను అరెస్టు చేసిన పోలీసులు

గుంటూరు: శ్రీనివాసరావుతోటలోని కలప డిపోపై దుండగులు దాడికి దిగారు. డిపోలోని సామగ్రిని ధ్వంసం చేశారు. మాజీ కార్పొరేటర్‌ తన మనుషులతో దాడి చేశారంటూ లాలాపేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాడికి దిగిన వారిని పోలీసులు అరెస్టు చేసి…

విత్తన దుకాణాన్ని జప్తుచేసిన విజిలెన్స్‌ అధికారులు

గుంటూరు జిల్లా : సత్తెనపల్లిలో రూ. 3లక్షల విలువైన పత్తివిత్తనాలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎమ్మార్పీ ధర కంటే అధికంగా విత్తనాలను అమ్ముతున్న విత్తన దుకాణాన్ని జప్తుచేశారు. గురువారం సత్తెనపల్లిలోని విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ అధికారులు…

మత్స్యకారుల ఘర్షణ ఎనిమిది మందికి గాయాలు

కృష్ణా జిల్లా: జిల్లాలోని చాట్రాయి మండలం తమ్మిలేరు జలాశయం వద్ద మత్స్య కారులు ఘర్షణకు దిగారు. రొయ్యల కోసం కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మత్య్స కారులు మధ్య జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది గాయపడినట్లు సమాచారం.

శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధికి సమావేశం

తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి పనుల ప్రణాళికపై చర్చించేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరుగుదొడ్లు, మంచినీరు. వసతిగృహాలు, రహదారుల వంటి…

గుంటూరు కలెక్టరుతో వైమానిక ప్రాధికార సంస్థ ప్రతినిధుల భేటీ

గుంటూరు జిల్లా : భారత వైమానిక ప్రాధికార సంస్థ ప్రతినిధులు గుంటూరు జిల్లా కలెక్టరు సురేశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. విమానాశ్రయం ఏర్పాటుకు గుంటూరులో, రాష్ట్రంలో 13 చోట్ల వైమానికి ప్రాధికార సంస్థ ప్రతినిధులు స్థల పరిశీలన చేపట్టారు. అందులో…

చిన్న తల్కాపురంలో ఇద్దరు దారుణ హత్య

కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నతల్కాపురంలో ఇద్దరు వ్యక్తులు దారుణహత్యకు గురయ్యారు. కోడుమూరు నుంచి కర్నూలు కోర్టుకు వెళ్తున్న ఇద్దరిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో కోడూమూరుకు చెందిన వెంకటరాముడు, అంజనేయులు మృతిచెందారు.