తిరుపతి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయ అభివృద్ధి పనుల ప్రణాళికపై చర్చించేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అధికారులతో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆలయాన్ని సందర్శించే భక్తులకు మరుగుదొడ్లు, మంచినీరు. వసతిగృహాలు, రహదారుల వంటి సమస్యలపై చర్చించారు. అలయానికి అనుసంధానంగా ఉన్న స్కిట్ కళాశాల అభివృద్ధి పనులు, ఆలయం ఆధ్వర్యంలో పాఠశాల ఏర్పాటు తదితర అంశాలూ ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. రాజగోపుర బాధితులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, నష్టపరిహారం చెల్లించడంలో జాప్యంపై ఈ సమావేశంలో అధికారులను బాధితులు నిలదీయడంతో కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది.




