Tuesday, 24 November 2026

సీమాంధ్ర

పెద్దపర్తికుంటలో ఏనుగుల బీభత్సం

చిత్తూరు : జిల్లాలోని గుడుపల్లి మండలం పెద్దపర్తికుంటలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో సాగుచేస్తున్న టమాటా, బీన్సు పంటలను 15 ఏనుగులు ధ్వంసం చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సీపీఐ నేతల ముందస్తు అరెస్టు

గుంటూరు : జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని భావించిన సీపీఐ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పోలీసుల తీరును సీపీఐ నాయకులు తీవ్రంగా ఖండించారు.

50 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

డక్కిలి : నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో మినీలారీ సహా 50 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.…

అవినీతి మంత్రులను తొలగించిన కేంద్రం: అంబటి

గుంటూరు: అవినీతి మంత్రులను కేంద్రం తొలగించడంలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పిఎంఓలో నివేదికను ట్యాంపరింగ్‌ చేసినా కేసులు నమోదు చేయలేదన్నారు. అవినీతి మంత్రులను తొలగించడానికి కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదు?…

భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్యహత్య

విశాఖపట్నం, జనంసాక్షి: భర్త వేధింపులకు తాళలేక భర్య ఆత్యహత్య చేసుకుంది. పెందుర్తి మండలం అక్కిరెడ్డిపాలెంలో ఈఘటన జరిగింది. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ…

బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

విజయవాడ, జనంసాక్షి:బందర్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదంజరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

లారీ బోల్తాపడి ఇద్దరి మృతి

విజయనగరం జనంసాక్షి: కురుపాంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తాపడుటంతో ఈప్రమాదం జరిగింది.

బైక్‌ ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

విజయవాడ, జనంసాక్షి:బందర్‌రోడ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ప్రమాదంజరిగింది. ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

లారీ బోల్తాపడి ఇద్దరి మృతి

విజయనగరం జనంసాక్షి: కురుపాంలోజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. లారీ బోల్తాపడుటంతో ఈప్రమాదం జరిగింది.