డక్కిలి : నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని కమ్మవారిపల్లి గ్రామ సమీపంలో మినీలారీ సహా 50 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు అంచనావేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు డక్కిలి ఉపరేంజ్ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. అధికారులను చూసిన స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.




