Tuesday, 24 November 2026

సీమాంధ్ర

రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయబేధాలు స్వల్పమైనవే

వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ శ్రీకాకుళం: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు స్వల్పమైన వేనని వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ ముకుందశర్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో…

ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి

విశాఖపట్నం: ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళవారం సాధారణ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా…

నేడు శ్రీకాకుళంలో వంశధార ట్రైబ్యునల్‌ పర్యటించనున్న కమిటీ

శ్రీకాకుళం: ఒడిశాతో రాష్ట్రానికి గల జల వివాదాలను పరిష్కరించేందుకు వంశధార ట్రైబ్యునల్‌ అత్యున్నత స్థాయి కమిటీ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. భామిని మండలం నేరడి బ్యారేజి ప్రతిపాదిత ప్రాంతంతోపాటు కాట్రగడ బి వద్ద సైడ్‌ వియ్యర్‌, హిర…

కాంగ్రెస్‌ కార్యకర్తపై బాంబులతో దాడి

కడప : పెద్దముడియం మండలం సుద్దపల్లికి చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త వెంకటేశ్వరరెడ్డిపై ప్రత్యేర్థులు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేపట్టారు.

7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి మండలం గుండక్లమ్మ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ముఠాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 7 ఇసుక ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు.

భారీ ఈదురు గాలులు వల్ల చెట్లు , విద్యుత్‌స్తంభాలు, నేలకూలాయి

రాకపోకలకు అంతరాయం ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని పంగూలూరు మండలం ముప్పవరం, బూదవాడలో 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. దాంతో ముప్పవరం, బూదవాడ ,…

పత్తికొండలో ఐదేళ్ల బాలకపై అత్యాచారం

కర్నూలు, జనంసాక్షి: పత్తికొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలికపై ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్థిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం

విశాఖ: విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పశ్చిమ, దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతి

విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం శనగపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు.

తప్పిపోయిన యువకుల ఆచూకీ లభ్యం

సీఎన్‌పురం, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన భైరవకోనలో కొండపైనున్న అడవిలో నిన్న దారితప్పిపోయిన ముగ్గురు యువకుల ఆచూకీ తెలిసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలేనికి చెందిన సాన ప్రసాద్‌కుమార్‌ , కావలికి చెందిన చెమిడి మణికుమార్‌, కొమ్మరి…