సీఎన్‌పురం, ప్రకాశం: ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన భైరవకోనలో కొండపైనున్న అడవిలో నిన్న దారితప్పిపోయిన ముగ్గురు యువకుల ఆచూకీ తెలిసింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలేనికి చెందిన సాన ప్రసాద్‌కుమార్ , కావలికి చెందిన చెమిడి మణికుమార్, కొమ్మరి ప్రవీణ్‌కుమార్‌లు అడవిలో చిక్కుకున్నారు. సీఎన్‌పురం ఎస్సై షేక్ లాల్ అహ్మద్, పోలీసులు ఆదివారం రాత్రి నుంచి అడవిలో గాలింపు చర్యలు చేపట్టి ఈ వేకువజామున వారిని గుర్తించి స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తప్పిపోయిన యువకులు క్షేమంగా అడవి నుంచి బయటపడటంతో అంతా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు.




