విశాఖపట్నం: ఒడిశా నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మంగళవారం సాధారణ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షపు జల్లులు కురిసే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడన ద్రోణి కారణంగా దట్టమైన మేఘాలు ఏర్పడి సొమవారం ఉదయం 8 గంటలు నుంచి కోస్తాంధ్రలో వాతావరణం చల్లబడింది. విశాఖలో రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. విదర్భ నుంచి కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన మరో ద్రోణి ప్రభావంతో రాయలసీమ, తెలంగాణలోనూ అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.




