శ్రీకాకుళం: ఒడిశాతో రాష్ట్రానికి గల జల వివాదాలను పరిష్కరించేందుకు వంశధార ట్రైబ్యునల్ అత్యున్నత స్థాయి కమిటీ నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనుంది. భామిని మండలం నేరడి బ్యారేజి ప్రతిపాదిత ప్రాంతంతోపాటు కాట్రగడ బి వద్ద సైడ్ వియ్యర్, హిర మండలంలోని గొట్టా బ్యారేజి ప్రాంతాలను పరిశీలించనుంది. రేపు ఒడిశా ప్రాంతంలో కమిటీ పరటన చేపట్టనుంది.




