Tuesday, 3 November 2026

రెండు రాష్ట్రాల మధ్య అభిప్రాయబేధాలు స్వల్పమైనవే

వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌

శ్రీకాకుళం: వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు స్వల్పమైన వేనని వంశధార ట్రైబ్యునల్‌ కమిటీ ఛైర్మన్‌ ముకుందశర్మ తెలిపారు. ట్రైబ్యునల్‌ కమిటీ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన చేపట్టింది. ఈ నేపథ్యంలో కమిటీ ఛైర్మన్‌ మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఇరుపక్షాల వాదనలు మళ్లీ వింటామని చెప్పారు. నదీ జలాల వివాదం పరిష్కారానికి నిర్ణీత గడువు లేదని, సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *