పోలవరం ప్రాజెక్టు పనులకు భూమిపూజ
దేవునిపట్నం : పోలవరం ప్రాజెక్టు పనులకు గుత్తేదారు ఈ ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవునిపట్నం మండలం అంగులూరు కొండవద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
దేవునిపట్నం : పోలవరం ప్రాజెక్టు పనులకు గుత్తేదారు ఈ ఉదయం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా దేవునిపట్నం మండలం అంగులూరు కొండవద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కడప : సమస్యల పరిష్కారం కోరుతూ కడప జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లు కొందరు కలెక్టరేట్‌లోకి చొచుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహ…
గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగిలో గ్రామీణ వికాస బ్యాంకులో దుండగులు బుధవారం అర్థరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి దోపిడీకి యత్నించారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన అధికారులు విషయం గ్రహించి పోలీసులకు…
హుకుంపేట : విశాఖ జిల్లా హుకుంపేట మండలం అల్లంపుట్ గ్రామంలో అతిసారం విజృంభిస్తోంది. గడచిన రెండు రోజుల్లో అతిసారంతో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందారు. మరో 16 మంది తీవ్ర స్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండలో రైస్ మిల్లులపై ఈరోజు ఉదయం అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల చౌక ధరల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాకినాడ : కాకినాడలోని ఇంద్రపాలెంలో శ్రీనివాస ప్రైవేటు పాఠశాల సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వంద ఇళ్లు దగ్థమైనట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పుతోంది. మంటల్లో గ్యాస్ సిలెండర్లు పేలుతుండడంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.
విశాఖపట్నం : విశాఖలోని సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం.
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా చనుబండ నుంచి జంగారెడ్డిగూడెంలోని ఓ వ్యాపారి వద్దకు వీటిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి…
అనంతపురం : ప్రజల వద్ద నుంచి సొమ్ము వసూలు చేసి పరారైన అక్షితా గోల్డ్ మనీస్కీమ్ నిర్వాహకుడు వెంకటేశ్వరరావును అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలో ప్రజల వద్ద నుంచి వెంకటేశ్వరరావు రూ. 1.6 కోట్ల వసూలు చేసినట్లు…
పెదపాడు : పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రు వద్ద ఈ తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి…