Monday, 23 November 2026

సీమాంధ్ర

తెల్లవారుజాము వరకు కొనసాగిన పాదయాత్ర

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా.. మీ కోసం’  పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. నిన్న సాయంత్రం కురుమద్దాలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర మంగళవారం తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం గుడివాడ సమీపంలోని గాంధీ…

ఏసీబీ వలలో గుంతకల్‌ డీసీటీవో

అనంతపురం : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ గుంతకల్‌ డీసీటీవో (డిప్యూటీ కమిర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌) ఏసీబీ అధికారులకు చిక్కారు.గుంతకల్‌ డీసీటీవో అధికారిగా పనిచేస్తున్న రమేష్‌కుమార్‌రెడ్డి ఓ లారీ యజమాని నుంచి లంచం డిమాండ్‌ చేయగా ఆ…

రెండు లారీలు ఢీ… ఇద్దరి మృతి

గుంటూరు : పిడుగురాళ్ల మండలం అంజనీపురం వద్ద ఈ ఉదయం రెండు లారీలు ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా…ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు నుంచి కంభంపాడుకు వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకోనడంతో…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మీతి

విశాఖ: సీలేరు వద్ద ఈ ఉదయం ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సీలేరు ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఆత్రేయపురం : తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వెలిచేరు వద్ద ఈ ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. గడ్డి లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడిన ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పెనేగొండ మండలం…

ఉత్తరప్రదేశ్‌లో నదిలో పడిన జీపు.. 11 మంది మృతి

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ప్రయాణీకులతో వెళ్తుఉన్న జీపు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. సాయినదిలోకి జీపు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద మృతుల కుటంబీకులకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ. 2 లక్షల…

కాశ్మీర్‌లో ఇద్దరు పోలీసుల కాల్చివేత

శ్రీనగర్‌ : కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఇద్దరు పోలీసులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. జమ్మూకాశ్మీర్‌ సాయుధ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు పోలీసులు కుప్వారా జిల్లాలోని హంద్వారాలో విధుల్లో వుండగా ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. గాయపడిన పోలీసులను వెంటనే ఆసుపత్రిలో…

తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభం

తిరుమల : అన్నమయ్య భవన్‌లో తితిదే పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో సుమారు రూ. 2,500 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తితిదే ఇంజినీరింగ్‌ విభాగానికి అధికమొత్తంలో నిధులు కేటాయించనున్నారు. 65 ఏళ్లకు అర్చకుల…

మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి

శ్రీనగర్‌: ఉత్తర కాశ్మీర్‌లోని హన్‌ద్వారాలో మిలిటెంట్లు తెగబడ్డారు. తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ లీకేజీ

కాకినడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్టేడియం రోడ్డులో సీఎన్‌జీ పైపులైన్‌ నుంచి గ్యాస్‌ లీకవుతోంది. గ్యాస్‌ భారీగా  బయటకు వస్తుండటంతో భయంతో స్థానాకులు పరుగులు తీశారు. పైపులైన్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్‌  బయటకు వచ్చిందని కార్మికులు…