Monday, 23 November 2026

సీమాంధ్ర

శ్రీవారి సేవలో ఇస్రో ఛైర్మన్‌

తిరుమల: ఇస్రో ఛెర్మన్‌ రాధాకృష్ణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐఫీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబసమేతంగా ఆలయానికి విచ్చేశారు. రేపు శ్రీహరికోట నుంచి ప్రయోగించే పీఎన్‌ఎల్‌వీ-సి20 రాకెట్‌ నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేయించారు.…

పధాని పర్యటనకు పటిష్ఠ బందోబస్త

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించి, క్షతగాత్రులను పరామర్శించేందుకు హైదకాబాద్‌కు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రానున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు భారీ భద్రతను చేపట్టారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను ఎన్‌పీజీ, ఎన్‌ఎన్‌జీ బలగాలు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని…

సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

మియాపూర్‌, హైదరాబాద్‌ : సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్‌కు చెందిన రమ్య(24) హైటెక్‌సిటీ సమీపంలోని ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో గత కొన్నిరోజులుగా పనిచేస్తోంది. నిన్న రాత్రి మియాపూర్‌ అల్విన్‌కాలనీలోని తన ఇంట్లో…

తిరుమల బస్టాండ్‌లో సూట్‌కేసు కలకలం

తిరుపతి: తిరుమల బస్టాండ్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన సూట్‌కేసు పోలీసులను పరుగులు పెట్టించింది. బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద సూట్‌కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే బాంబు స్క్వాడ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు సూట్‌కేసును…

రైల్వేసబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

నెల్లూరు: కావలి బుడంగుంట వద్ద రైల్వే సబ్‌స్టేషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే తాము వచ్చేంత వరకూ మంటలు ఆర్పవద్దని అగ్నిమాపక సిబ్బందిని రైల్వే అధికారులు ఆదేశించారు.…

25 మంది ఎర్రచందనం కూలీల అరెస్టు

రాపూర్‌ : నెల్లూరు జిల్లా రావూర్‌ మండలం పెంచలకోనలోని వెలిగొండ అటవీప్రాంతంలో తమిళనాడుకు చెందిన 25 మంది ఎర్రచందనం కూలీలను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలలుగా అడవుల్లో ఎర్రచందనం నరికి తిరుగు ప్రయాణం…

విశాఖలో 8 మంది మిలీషియా సభ్యుల అరెస్టు

విశాఖ: జీకేవీధిలో 8 మంది మిలీషియా సభ్యులను ఈ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

విద్యుదాఘాతంతో తల్లీకొడుకుల మృతి

చల్లపల్లి : కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం ఒక్కలగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో తల్లీ కుమారుడు మృతి చెందాడు. కోళ్లఫారంలో పని చేస్తున్న డేగుల రమణ (45) పొరపాటున అక్కడ ఉన్న విద్యుత్తు తీగాలను తాకి విద్యుదాఘాతానికి గురయింది. ఆమె…

నెల్లూరు కలెక్టర్‌, ఎస్పీలకు లోకాయుక్త నోటీసులు

నెల్లూరు : గూడూరు సబ్‌కలెక్టర్‌కు ఇచ్చిన వారెంట్లను అమలు చేయకపోవడంపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ…

పోలీసుల అదుపులో ఎర్రచందనం స్మగ్లర్లు

సుండుపల్లి: తమిళనాడుకు చెందిన ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లును బుధవారం అర్థరాత్రి కడప జిల్లా సుండుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శేషాచల పర్వతాల్లో విస్తారంగా ఉన్న ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన పలువురు స్మగ్లర్లు మండలంలో రాయవరం  ప్రాంతం నుంచి స్మగ్లింగ్‌…