మియాపూర్, హైదరాబాద్ : సాప్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఓ యువతి మియాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది. కరీంనగర్‌కు చెందిన రమ్య(24) హైటెక్‌సిటీ సమీపంలోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో గత కొన్నిరోజులుగా పనిచేస్తోంది. నిన్న రాత్రి మియాపూర్ అల్విన్‌కాలనీలోని తన ఇంట్లో ఎవరూలేని సమయంలో పడకగదిలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు




