Monday, 23 November 2026

సీమాంధ్ర

కడప డీసీసీబీ ఎన్నిక వాయిదా

కడప : నేడు జరగవలసిన డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికను భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ తెలిపారు. తిరిగి ఈ నెల 28న ఎన్నిక నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా

కడప : కడప జిల్లా డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదావేశారు. డీసీసీబీ ఎన్నికల అధికారిగా జిల్లా రిజిస్ట్రార్‌ లింగా సుబ్బయ్య నియమితులయ్యారు. సాయంత్రం డైరెక్టర్లందరికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న కనిపించకుండా పోయిన జిల్లా ఎన్నికల…

కడప అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యం

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఎన్నికల అధికారి ఆచూకీ చిత్తూరులో లభ్యమైనట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతండటంతో డీసీసీబీ కార్యాలయం వద్ద వైకాపా, కాంగ్రెస్‌…

నిలిచిపోయిన ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌

శ్రీకాకుళం : ఒడిశాలో సార్వత్రిక సమ్మె కారణంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలన రైల్వేస్టేషన్‌లో విల్లుపురం – ఖరగ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పైడిభీమవరం పారిశ్రామిక వాడలో కార్మికులు…

అధ్యక్ష ఎన్నిక నిర్వహించకపోతే ఆత్మహత్య చేసుకుంటా

– మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి నాగరాజుపేట: కడప జిల్లా నాగరాజుపేట డీసీసీబీ బ్యాంకు వద్ద వైకాపా ఎమ్మెల్యేలు డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నిక చేపట్టాలని ధర్నా చేపట్టారు. అధ్యక్ష ఎన్నిక ఈరోజు చేపట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్‌ సోదరుడు…

కడప డీసీసీబీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో హైడ్రామా నడుస్తోంది. వైకాపా, కాంగ్రెస్‌ నేతలు ఈ ఉదయమే డీసీసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆరుగురు డైరెక్టర్లతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి డీసీసీబీ సమావేశ మందిరం వద్దకు వచ్చి ఎన్నికల అధికారి…

లారీ దూసుకెళ్లి విద్యార్థి మృతి

పిడుగురాళ్ల : గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ఈ ఉదయం పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిదో తరగతి చదువుతున్న మారం భార్గవ్‌ (14) అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థి…

ఆరుగురు ఎర్రచదంనం స్మగ్లర్ల అరెస్ట్‌

అనంతపురం : అనంతపురం జిల్లా ఎన్‌పికుంట్లలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, రెండు వాహనాలను సీజ్‌ చేశారు. స్మగ్లర్లను అధికారులు విచారిస్తున్నారు.

డీసీసీబీ ఎన్నికల అధికారి అదృశ్యం

కడప : డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిన డీసీసీబీ ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌ నిన్న రాత్రి నుంచి కనిపించకపోవడంతో పలు వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తన భర్త అదృశ్యమైనట్లు ఎన్నికల…

నడుచుకుంటూ అయినా హైదరాబాద్‌ చేరుకుంటాం : ఏపీఎన్‌జీవో

విశాఖపట్నం : ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చి 2న తలపెట్టిన చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని ఏపీ జేఏసీ నిర్ణయించింది. ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ 10వ వేతన సంఘాన్ని నియమించాలని కోరుతూ తాము…