Monday, 23 November 2026

సీమాంధ్ర

నెల్లూరు జిల్లా చిల్లకూర మండలంలో దారుణం

నెల్లూరు: జిల్లాలోని చిల్లకూర మండలం వరగలిలో దారుణం జరిగింది. తండ్రి చేసిన బాకీ కిందికి ఐదేళ్ల బాలుడిని దాబా యజమాని జీతం ఉంచుకున్నాడు. పని చేయడంలేదని దాబా యజమాని బాలుడిని చితకబాదడంతో దెబ్బలకు తాళలేక ఉదయం బాలుడు మృతి…

ఎర్రచందనం పట్టివేత

విశాఖ: షీలానగర్‌లో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని తెలియజేశారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి నిందితులను అదుపులోకి  తీసుకున్నట్లు చెప్పారు.

అధిక వడ్డీల పేరుతో మోసగిస్తున్న ఇద్దరి అరెస్టు

విశాఖ : నగరంలో అధిక వడ్డీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరిని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు . నిందితుల నుంచి రూ. లక్షల, కారు, ఆటో, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

విద్యార్థి చేయి విరగ్గొట్టిన ఉపాధ్యాయురాలు

కాకినాడ : ఉపాధ్యాయురాలు విద్యార్థి చేయి విరగ్గొట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ ఇంద్రపాలెం ఉషామెరిట్‌ పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంటిపని చేయనందుకు ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థిని తీవ్రంగా దండించింది. చేయిపై బలంగా కొట్టింది. దీంతో విద్యార్థి చేయి విరిగి…

గుంటూరులో విత్తన విత్తన విక్రయకేంద్రాలపై దాడులు

గుంటూరు : జిల్లాలోని చేబ్రోలులో మొక్కజొన్న విత్తనవిక్రయ కేంద్రాలపై వ్యవసాయశాఖ అధికారులు దాడిచేశారు. ఈ దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న రూ. 5 లక్షల విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కాలువలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ప్రకాశం : ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం ఆగ్రహారం వద్ద ఆర్టీసీ బస్సుకు బ్రేక్‌ విఫలం కావడంతో పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

అనుమానంతో భార్య హత్య : భర్తకు ఉరిశిక్ష వేసిన కోర్టు

రాజమండ్రి : భార్యను చంపిన ఓ భర్తపై తూర్పు గోదావరి జిల్లా అమలాపురం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . అనుమానంతో భార్యను చంపిన ఓ భర్తకు కోర్టు మరణశిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. జిల్లాకు చెందినా…

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పార్టీలకతీతంగా మద్దతివ్వాలి: శైలజానాధ్‌

అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాధ్‌ కోరారు. అనంతపురం విలేకర్లతో మాట్లాడిన ఆయన ఉప ప్రణాళిక కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని…

కృష్ణా తీరాన భక్తుల పుణ్యస్నానాలు

విజయవాడ : కార్తీక పౌర్ణమి పర్వదినాన కృష్ణా తీరానికి భక్తులు పోటెత్తారు.ఈ తెల్లవారుజాము నుంచే విజయవాడ దుర్గాఘాట్‌లో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. నదిలో నీటి మట్టం లేకపోవడంతో దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేసిన జల్లు స్నానాల ఘట్టాల…

14 కిలోల గంజాయి స్వాధీనం

విజయనగరం : విజయనగరం జిల్లాలో ఎక్సైజ్‌ పోలీసులు 14 కిలోల గంజాయిని స్వాథీనం చేసుకున్నారు. జిల్లాలోని ఎస్‌, కోట మండలం బొడ్డవర వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేసి వారి దగ్గరనుంచి గంజాయిని స్వాధీనం…