నెల్లూరు జిల్లా చిల్లకూర మండలంలో దారుణం

నెల్లూరు: జిల్లాలోని చిల్లకూర మండలం వరగలిలో దారుణం జరిగింది. తండ్రి చేసిన బాకీ కిందికి ఐదేళ్ల బాలుడిని దాబా యజమాని జీతం ఉంచుకున్నాడు. పని చేయడంలేదని దాబా యజమాని బాలుడిని చితకబాదడంతో దెబ్బలకు తాళలేక ఉదయం బాలుడు మృతి చెందాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాబా యజమాని కోసం గాలిస్తున్నారు.