ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు పార్టీలకతీతంగా మద్దతివ్వాలి: శైలజానాధ్
అనంతపురం: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టబద్ధత కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాధ్ కోరారు. అనంతపురం విలేకర్లతో మాట్లాడిన ఆయన ఉప ప్రణాళిక కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కిరణ్‌కుమార్‌రెడ్డి కృషి చేశారని కొనియాడారు. జనాభాలో 22.5 శాతంగా ఉన్నవారికి సంబంధించిన అంశం కావున దీనిపై అందరూ సానూకూలంగా స్పందించాలన్నారు. సమాజం ఎంత అభివృద్ధి చెందుకున్నా దళితులకు ఉన్నత వర్గాలకు మధ్య అంతరం ఇంకా కోనసాగుతోందని మంత్రి అభిప్రాయపడ్డారు.



