Saturday, 28 November 2026

వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో హింస …. ఇద్దరి మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో హింస చోటుచేసుకుంది. బుర్‌ద్వాన్‌ జిల్లా మధుడంగా గ్రామ పంచాయతీ పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీపీఎం పార్టీ తరపున పోటీచేసిన అభ్యర్థి మనోహ్ర బీబీ…

దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌

చెన్నై,(జనంసాక్షి): కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రంలో తొలి రియాక్టర్‌ విజయవంతం అయింది. నెలరోజుల్లో దక్షిణాది గ్రిడ్‌కు కూడంకుళం విద్యుత్‌ను అనుసందానం చేస్తామని అధికారులు తెలిపారు.

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సెన్సెక్స్‌ 20 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

నేడు సీబీఐ కోర్టుకు హాజరుకానున్న ధర్మాన, సబితా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు సీబీఐ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు , ఎమ్మార్‌ కంభకోణం, ఓబులాపురం గనుల కేసులు విచారణ రానున్నాయి. ఈ కేసుల్లో నిందితులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు కోర్టుకు హాజరుకానున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ…

పరారైన రిమాండ్‌ ఖైదీ

నాగర్‌కర్నూలు గ్రామీణం: మహబూబ్‌నగర్‌ జిల్లా నాగర్‌కుర్నూలు సబ్‌ జైలు నుంచి పుట్ట శ్రీను అనే రిమాండ్‌ ఖైదీ పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలకపల్లి మండలానికి చెందిన శ్రీనును పలు విగ్రహాల ధ్వంసం కేసులో ఏప్రిల్‌ 15న…

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం కాపవరంలోని నందమూరికాలనీలో ఆదివారం రాత్రి కలుషిత ఆహారం తని ఇద్దరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.

నేటి నుంచి ప్రారంభకానున్న పెద్దమ్మతల్లి ఉత్సవాలు

ఫిలింనగర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో సోమవారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 17 వరకు ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. వందలాది కిలోల కూరగాయలతో అలయ ప్రాంగణాన్ని, ముఖద్వారాన్ని…

ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో తొక్కిసలాట…18 మంది మృతి

జకర్తా : తూర్పు ఇండోనేషియా నబిరే పట్టణంలోని కోటలామ బాక్సింగ్‌ స్టేడియంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. స్థానిక బాక్సర్లు ఛాంపియన్‌షిప్‌ను ఓడిపోవడంతో వారి మద్ద తుదారులు స్టేడియంలో అల్లర్లకు…

రేషన్‌ బియ్యం పట్టుకున్న తహసీల్దార్‌

నందిగామ గ్రామీణం: కృష్ణా జిల్లా నందిగామ నుంచి ఏలూరుకు అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు ఈ ఉదయం పట్టుకున్నారు. మండలంలోని జొన్నలగడ్డ వద్ద లారీలో తరలిస్తుండగా బియ్యాన్ని పట్టుకుని తహసీల్దార్‌కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

మండేలా త్వరలో డిశ్చార్జి: ఎంబెకి

జోహన్నెస్‌బర్గ్‌: వూపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్‌ మండేలా త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని తబో ఎంబెకి తెలిపారు. ఈ మేరకు మాజీ అధ్యక్షుడు ఎంబెకి వ్యాఖ్యలను స్థానిక రేడియో ఛానెల్‌ ఐవిట్‌నెన్‌ ఉటంకించింది.…