Wednesday, 25 November 2026

వార్తలు

శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలు కొనసాగించాలి వెంకయ్య

హైదరాబాద్‌ : డా. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ 61వ వర్థంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా సీనియర్‌నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… ముఖర్జీ అశయాలను యువత కొనసాగించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో…

డీఎన్‌తో జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : పీసీసీ మాజీ అధ్యక్షుడు డీఎస్‌తో మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. ఢిల్లీ పరిణామాలు, ఈనెల 30న నిర్వహించే బహిరంగసభపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

ఇద్దరు గుంటూరు జిల్లా వాసులు మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరకాశీ వరదల్లో చిక్కుకుని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగికి చెందిన తిప్పావజ్జుల మల్లేశ్వరి, కొండరాజు కృష్ణకుమారి మృతిచెందారు. గౌరీకుంద్‌లో ఇంకా నలుగురు గుంటూరు జిల్లా వాసుల ఆచూకీ లభ్యంకా లేదు. మున్నంగికి చెందిన తమ్మా…

ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరాభ్యాసం

విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రిపై సామూహిక అక్షరభ్యాసం, అక్షరదీవెన వైభవంగా జరిగింది. అలయ ఈవో ప్రభాకర్‌ శ్రీనివాస్‌ కార్యక్రమాన్ని ప్రారంభించగా, వైదిక కమిటీ సభ్యులు అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన చిన్నారులకు…

150 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్‌,(జనంసాక్షి): జిల్లాలోని హన్మకొండలో అక్రమంగా తరలిస్తున్న 150 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ఎంపీ పాల్వాయితో జానా, డీఎస్‌ భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్‌నరెడ్డితో మంత్రి జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. తెలంగాణ అంశం, ఈ నెల 30న జరిగే సమావేశం గురించి సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ ఇంట్లో చోరీ

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ మామిడి లక్ష్మీబాయి ఇంట్లో చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ. 4లక్షల విలువైన బంగారు అభరణాలను అపహరించారు.

వితంతువులకు సమానహక్కు కల్పించాలి

వరంగల్‌,(జనంసాక్షి): అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్‌లో వితంతువులు భారీ ర్యాలీని నిర్వహించారు. వితంతువుల సమానతకై పోరాడుదామంటూ కలెక్టరేట్‌ నుంచి బాల వికాస ఆధ్వర్యంలో ఖాజీపేట వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ ఎమ్మెల్యే సీతక్క ప్రారంభించారు.…

మావోయిస్టుల దాడిలో పోలీసులకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌: నారాయణపూర్‌ జిల్లాలోని దొరైపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాజీపేట చేరుకున్న 30 మంది యాత్రికులు

వరంగల్‌ : ఉత్తరాఖండ్‌ వరదల నుంచి సురక్షితంగా బయటపడిన రాష్ట్రానికి చెందిన 30 మంది చార్‌ధావమ్‌ యాత్రికులు ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం సాయంత్రం కాజీపేట చేరుకున్నారు. వీరిని స్వస్థలాలకు తరలించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది.