Thursday, 19 November 2026

వార్తలు

టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది

హైదరాబాద్‌: మలక్‌పేట మూసారంబాగ్‌లోని టింబర్‌ డిపోలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు.

2జీ ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం

న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం ముసాయిదా నివేదికపై నేడు జేపీసీ కీలక సమావేశం నిర్వహించనుంది. అయితే నివేదికను ఓటింగ్‌తో తిరస్కరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.

భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి చక్రతీర్థం స్నానం

ఖమ్మం: భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఇందులో భాగంగా గోదావరి తీరంలో చక్రతీర్థం స్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

ఇద్దరు గిరిజనులను హత్యచేసిన మావోయిస్టులు

సీలేరు(విశాఖ): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మత్లీ పోలీసు స్టేషన్‌ పరిధిలో నిన్న తెల్లవారుజామున ముగ్గురు గిరిజనులను మావోయిస్టులు అపహరించారు. ఇందులో  ఇద్దరిని హతమార్చి వారి స్వగ్రామాలకు సమీపంలో మృతదేహాలను పడేశారు.

బంగ్లాదేశ్‌ ఘటనలో 140కి చేరిన మృతుల సంఖ్య

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా శివారులోని సవార్‌ ప్రాంతంలో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 140 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద సహాయక…

బావిలోకి దూకి ఇద్దరి పిల్లలతో తల్లి ఆత్మహత్య

కడప: అట్లూరి మండలం బోడిశెట్టిపల్లిలో భర్త మందలించాడని ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాంతనపల్లి ప్రాజెక్టు సవరించిన ఆంచనాలకు ఆమోదం

హైదరాబాద్‌:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్‌ పవర్‌ బ్లాక్‌ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జూపార్కులొ ఎలుగుబంటి దాడి

హైదరాబాద్‌:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.

కానిస్టేబుల్‌పై కత్తితో దాడి

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ కానిస్టేబుల్‌ కృష్ణపై అతని బంధువులు కత్తితో దాడి చేశారు.కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.దాడిలో గాయపడిన కృష్ణను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.