Thursday, 19 November 2026

వార్తలు

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన ఓ ఆటోడ్రైవర్‌

కేపీహెచ్‌బీ కాలనీ, హైదరాబాద్‌: మూసాపేట్‌లో భవానీనగర్‌కు చెందిన దుర్గా దేవయ్య దంపతులు వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఐదేళ్లపాప ఉంది. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఆ చిన్నారి మంగళవారం సాయంత్రం ఇంటికి సమీపంలోని తన…

120కి చేరిన టిబెటన్ల సంఖ్య

బీజింగ్‌: టిబెటన్ల ఆత్మాహుతులు కొనసాగుతూనే ఉఆన్నయి. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని ఒక బౌద్ధ ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ఇద్దరు యువ బౌద్ధ సన్యాసులు ఆత్మార్పణం చేసుకున్నారు. మరో చోట జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో ఓ యువతి ఆత్మాహుతి చేసుకున్నట్లు…

విపక్షాల ఆందోళన వల్ల లోక్‌సభను రేపటికి వాయిదా స్పీకర్‌

న్యూఢిల్లీ: లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభంగానే బొగ్గుకుంభకోణం, 2జీ అంశాలపై విపక్ష సభ్యులు నిరసనకు దిగి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

ఐదుగురు కార్మికులను అపహరించిన మావోయిస్టులు అపహరించారు

పాట్నా: బీహార్‌ రాష్ట్రం జామూయ్‌ జిల్లాలో ఐదుగురు కార్మికులను మావోయిస్టులు అపహరించారు. వీరిని రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే కార్మికులుగా అధికారులు గుర్తించారు.

సమాజ్‌వాది పార్టీ నేత హత్య

గ్రేటర్‌ నోయిడా: సమాజ్‌ వాది పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చమన్‌ భాటిని దుండగులు బుధవారం గ్రామంలోని ఆయన ఇంటిదగ్గరే కాల్చిచంపారని పోలీసులు గురువారం పేర్కొన్నారు. నిన్న భాటి గన్‌మెన్‌లు ఇద్దరూ సెలవులో ఉన్న సమయం చూసి దుండగులు…

పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి

కృష్ణా : కంకిపాడు పోలీసుస్టేషన్‌ ఎదుట దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దేవరపల్లి రవితేజ హత్య కేసులో నిందితులను శిక్షించాలని దళితులు డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో అర్థరాత్రివేళ అన్నాచెల్లెళ్లు ఇంటికి వెళుతుండగా…

ఆదికేశవులునాయుడు మృతికి పలువురి సంతాపం

బెంగళూరు: ప్రముఖ పారిశ్రామిక వేత్త, లోక్‌సభ మాజీ సభ్యుడు ఆదికేశవులునాయుడు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌తోపాటు పలువురు నేతలు బెంగళూరులోని నివాసంలో భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు…

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

మహబూబ్‌నగర్‌: తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌లో అధికారులు నిలిపివేశారు. డీజిల్‌ ట్యాంక్‌ లీక్‌ అయినట్లు గుర్తించి మరమ్మతు పనులు చేపట్టారు.

రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్న యూనిట్‌ సీజ్‌

గుంటూరు: మాచవరం మండలం రాయవరంలోపాల తయారీ కేంద్రాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్న ఓ యూనిట్‌ను సీజ్‌ చేసి విచారణ చేపట్టారు.

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు గురువారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 40 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.