Tuesday, 17 November 2026

వార్తలు

ముగిసిన సోమమ్మ అంత్యక్రియలు

కడప : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అమ్మమ్మ సోమమ్మ అంత్యక్రియలు సోమవారం ఇక్కడ ముడిశాయి. సంప్రదాయబద్దంగా నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబీకులు, బంధుమిత్రులతో సహా కడప వాసులు సోమమ్మకు కన్నీటి నివాశులు అర్పించారు. ఆమె మనుమడు,…

విద్యుత్‌ సంక్షోభంపై చిన్న తరహా పరిశ్రమల సంఘాల దీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ సంక్షోభంపై రాజకీయ పక్షాలు చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమ సంఘాలు ఇవాళ ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యాయి. విద్యుత్‌ కష్టాలపై పార్టీలన్నీ ఉద్యమిస్తున్న తరుణంలో పారిశ్రామికవేత్తలు ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గుంటూరు : గుంటూరు జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కొండ్రుపాడు వద్ద సిలిండర్ల లోడ్‌తో వెళుతున్న లారీ ప్రమాదవశాత్తూ రోడ్డు విస్తరణ కోసం తవ్విన…

కరెంటు స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌: డ్రైవర్‌ మృతి

కర్నూల్‌, జనంసాక్షి: జిల్లాలోని కొలిమిగుండ్లలో ఈ ఉదయం స్తంభాన్ని ట్రాక్టర్‌ ఢీకొంది. ప్రమాదంలో డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా అతన్ని హుటాహుటిన బనగానపల్లి ఆసుపత్రికి తరలించారు.

రపు కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

తిరుమల : తిరుమల వెంకన్న ఆయలంలో మంగళవారం కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. తిరుమంజనం నేపధ్యంలో శ్రీవారికి అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనాన్ని మధ్యాహ్నం వరకు నిలిపివేశారు. అలాగే రేపు జరగాల్సిన అన్ని…

పేక మేడలు నిర్మిస్తున్నా పట్టించుకోరా?

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని థానేలో మూడు రోజుల క్రితం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన దుర్ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. నిరుపేదలకు తక్కువ అద్దెను ఎరగా చూపి అద్దెకు దింపిన బిల్డర్లు నిర్మాణంలో మాత్రం ఎలాంటి ప్రమాణాలు…

వెంకన్న సేవలో గవర్నర్‌,డీఎస్‌, కోట్ల

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌, కేంద్రమంత్రి కోట్ల ప్రకాష్‌ రెడ్డి తరితరులు స్వామివారిని దర్శించారు. అనంతరం వారికి…

కుటుంబ కలహలతో ఉరేసుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌ : సిటీ సెక్యురిటీ వింగ్‌లో విధులు నిర్వహిస్తున్న రామారావు అనే హెడ్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. సరూర్‌నగర్‌లోని తహసీల్దారు కార్యాలయం సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని అతను ఈ ఘటనకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే…

గుప్తనిధుల కోసం తవ్వకాలు, ఆరుగురి అరెస్ట్‌

విశాఖ : విశాఖ జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమిలీ సమీపంలోని అతిపురాతన నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

విశాఖ జిల్లాలో కురిసిన ఆమ్ల వర్షం

విశాఖ : విశాఖ జిల్లా భీమిలీ మండలం చిప్పాడలో సోమవారం ఆమ్లవర్షం కురిసింది. వర్షం నీళ్లు పసుపురంగులో పడ్డాయి. వర్షం పడినప్పుడు పొంగుతూ తెల్లగా సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌లో నీరు పోసిన విధంగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం…