Tuesday, 17 November 2026

వార్తలు

పాతాళగంగలో పడి భక్తుడు మృతి

కర్నూలు, జనంసాక్షి: పుణ్యస్నానానికని వెళ్లిన భక్తుడు కానరాని లోకానికి వెళ్లిపోయాడు. శ్రీశైలం పాతాళగంగలో స్నానమాచరించడానికి వెళ్లిన భక్తుడు ప్రమాదవశాత్తూ కాలు జారీ నీటిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు కర్ణాటక వాసిగా గుర్తించారు.

ప్రేమ వేధింపులు: యువతి ఆత్మహత్య

నల్లగొండ, జనంసాక్షి: ప్రేమ వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. నూతన్‌కల్‌ మండలం టి. కొత్తపల్లిలో ఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తమ కూతురిని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుందని యువతి తల్లిదండ్రులు పోలీసులకు…

చీరాలలో భార్య గొంతుకోసిన భర్త

చీరాల : ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. రాంనగర్‌ న్యూకాలనీలో భార్య కాపురానికి రావటం లేదనే అక్కసుతో భర్త… ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆందోళనకు దిగిన ప్రయాణికులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలభై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ అధికారుల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విమానంలో పరిమితికి మించి…

చక్కెర స్థాయి ప్రమారకంగా మారి కుప్పకూలిన ఎమ్మెల్యే

జనంసాక్షి : హైదరాబాద్‌ : ప్రభుత్వం పెంచిన కరెంట్‌ చార్జీలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో విజయమ్మతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో…

హైటెక్‌ సిటీలో హైటెక్‌ వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌ నగరంలో వ్యభిచారం కూడా హైటెక్‌ రూపు సంతరించుకుంది. బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తోన్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ  ఆధ్వర్యంలో పోలిసులు వ్యభిచారం గృహంపై దాడిచేసి రష్యాకు…

నేడు హస్తిన బాట పట్టనున్న సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తిన బాట పట్టనున్నారు. ఇవాళ ఆయన శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. అక్కడ ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలతో చర్చించనున్నారు.

67 కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే, జనంసాక్షి: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతుదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలంలో మూడోరోజు కూడా సహాయక చర్యలు…

ఎయిర్‌పోర్టులో ప్రమాణికుల ఆందోళన

హైదరాబాద్‌ : జెడ్డా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. జెడ్డా వెళ్లాల్సిన విమానం నలబై మంది ప్రయాణికులను విమానాశ్రయంలోనే వదిలి వెళ్లడంతో వారు విమానాశ్రయ అధికారుల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విమానంలో పరిమితికి మించి…

వాచీల దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్‌ : పంజాగుట్టలోని కమల్‌ వాచీ దుకానంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దుకానంలో నుంచి రూ.1.45 కోట్ల విలువైన వాచీలను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు బీహార్‌ రాష్ట్రానికి చెందినవారిగా…