Tuesday, 17 November 2026

వార్తలు

67కు చేరిన థానే మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరింది. నిన్న రాత్రి మరో నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి బయటకు తీశారు. ఘటనా స్థలంలోనూ మూడోరోజు కూడా సహాయక చర్యలు…

అయిదోరోజుకు చేరిన వైఎస్‌ఆర్‌ సీపీ దీక్ష

హైదరాబాద్‌ : కరెంట్‌ కోతలు-విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ దీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆరోగ్యం క్షీణిస్తోంది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మతో పాటు పలువురు నేతలకు వైద్యులు శనివారం పరీక్షలు నిర్వహించారు. వైఎస్‌…

ముగ్గురు పోలీసులకు మరణశిక్ష

లక్నో (ఉత్తరప్రదేశ్‌) : మూడు దశాబ్దాల నాటి గోండా నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో.. ముగ్గురు పోలీసులకు శుక్రవారం ఇక్కడి సీబీఐ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. మరో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది. 31 ఏళ్ల క్రితం గోండా…

120 బస్తాల రేషన్‌ బియ్యం పట్టివేత

కర్నూలు : కర్నూలు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. కొలివిగుండ్ల మండలం కనకాద్రిపల్లె వద్ద వాహనంలో రవాణా చేస్తున్న 120 బస్తాల రేషన్‌ బియ్యాన్ని పట్టుకుని సీజ్‌ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

హైకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులు

జనంసాక్షి : న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఐదుగురు అదనపు న్యాయమూర్తులు నియామకినికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. అడవల్లి రాజశేఖర్‌రెడ్డి, పొనుగోటి నవీన్‌రావు, సరసా వెంకటనారాయణ భట్‌, ఆకుల వెంకట శేషసాయి, చల్లా కోదండరాం చౌదరిని…

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల : తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు పది కంపార్ట్‌ మెంటులో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి అయిదు గంటలు, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది.

పోరాటాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి

పోరాటాలు, ప్రజా ఉద్యమాలకే ప్రభుత్వాలు తలొగ్గుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కుతగ్గడం. రాష్ట్ర చరిత్రనే మార్చిన ఘనత విద్యుత్‌ ఉద్యమాలకు ఉంది. 2020 వరకు నేనే సీఎంగా ఉంటానని స్వర్ణాంధ్రప్రదేశ్‌ నిర్మిస్తానని…

చిన్న పరిశ్రమలకు విద్యుత్తు తగ్గించే అంశాన్ని పరిశీంచాలి: చిరంజీవి

ఢీల్లీ : 200యూనిట్లలోపు వర్గాలకు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించటాన్ని స్వాగతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. చిన్న పరిశ్రమలకు విద్యుత్‌ తగ్గించే అంశాన్ని పరిశీలిసే బాగుంటుందని సూచించారు.

‘అంతరిక్ష ఆవాసం ‘ పోటీలో రవీంద్రభారతి పాఠశాల విద్యార్థుల ప్రతిభ

విశాఖపట్నం : అమెరికాలోని నాసా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘అంతరిక్ష అవాసం ‘ ప్రోజెక్టు పోటీలో రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు వరుసగా అయిదోసారి బహుమతుల పంట పండించారని రవీంద్రభారతి ఈఎం పాఠశాల ప్రిన్సపల్‌ టి. శ్రీదేవి…

ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకు విద్యార్థులతో ముఖాముఖ

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శుక్రవారం ప్రాంగణ ఉద్యోగ నియామకాల ఎంపికకై విద్యార్థులతో ముఖిముఖి నిర్వహించారు. కోరమాండల్‌ ఫెర్టిలైజర్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఏజీబీఎస్సీ అఖరి సంవత్సరం విద్యార్థులు 40…