Tuesday, 17 November 2026

వార్తలు

శాసన సభ ఉదయం 10 గంటల వరకు వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ నాలుగో రోజు సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. స్పీకర్‌ వాయిదా తీర్మానాలను తిరస్కరించడంతో సభలో విపక్ష సభ్యులు నిరసనకు దాగారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని తెరాస, భాజపా సభ్యులు స్పీకర్‌…

విపక్షాల అనైక్యత వల్లే కిరణ్‌ సర్కాకరు నిలబడింది : జూలకంటి

హైదరాబాద్‌ : ప్రధాన ప్రతిపక్షం తెదేపా అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోవడం వల్లే కిరణ్‌ సర్కారు కొనసాగుతోంది. సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆయన ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాల అనైక్యత…

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌ :శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభమయ్యాయి. వివిధ సమస్యలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

విషతుల్యమైన ఆహారం… అస్వస్థతకు గురైన విద్యార్థులు

కడప : కలసపాడులోని సెయింట్‌ ఆంతోనిస్‌ పాఠశాలలో ఆహారం విషతుల్యం కావడవంతో 10 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాల నిర్వాహకులపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటువేయాలని డీఎంకే ఒత్తిడి

చెన్నై : ఐక్యరాజ్యసమితిలో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డీఎంకే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయకపోతే మన్మోహన్‌ సర్కారు నుంచి వైదొలుగుతామని ఆ పార్టీ…

తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ పులివర్తి

సైదాబాద్‌ (హైదరాబాద్‌) : తెలుగులో అత్యధికంగా ఆధ్యాత్మిక చింతనపై వ్యాసాలు రాసినందుకు సైదాబాద్‌లోని జయనగర్‌ కాలనీకి చెందిన రచయిత, కవి డాక్టర్‌ పులివర్తి కృష్ణమూర్తికి మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసే తెలుగు బుక్‌…

భయబడేవాడిని,కాదు. బెదిరిస్తే పారిపోను : సీఎం

హైదరాబాద్‌ : తాను భయపడేవాడిని కాదని, బెదిరిస్తే పారిపోనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెరాస నేతల వ్యాఖ్యలపై సీఎం తీవ్రంగా స్పందించారు.కాలర్‌ పట్టుకొని మెడికల్‌ కాలేజీ ఇప్పించామని హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలపైనే తన అభ్యంతరమని అన్నారు హరీశ్‌రావు బాధపడి…

నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా

మొహాలీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 36 ఓటర్లు ముగిసేసరికి వికెట్లేమీ కోల్పోకుండా 109 పరుగులు చేసింది. కోవాన్‌ 43, వార్నర్‌ 50 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. వరణుడు ఆంటంకం…

అవిశ్వాస తీర్మానంపై నేడు చర్చ

హైదరాబాద్‌ : తెరాస ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై బీఏసీ సమావేశంలో విపక్ష నేతలతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ చర్చించారు. ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి తీర్మానంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ నిర్ణయించారు. మొత్తం గంటలపాటు చర్చ…

ఆలస్యంగా మొదలైన ఇంటర్‌ పరీక్ష

గుంటూరు విద్య : ఫిరంగిపురం రూరల్‌ క్రిస్టియన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష శుక్రవారం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. పరీక్ష కేంద్రానికి ఎకనామిక్స్‌ పాఠ్యాంశం ప్రశ్నాపత్రాలు తెలుగు మాధ్యమం బదులు ఇంగ్లీషు మాధ్యమం ప్రశ్నాపత్రాలు రావడంతో పరీక్ష…