Tuesday, 17 November 2026

వార్తలు

ఏపీ భవన్‌ లో టీఎంపీల భేటీ

న్యూఢిల్లీ: ఢిల్లీ లోని ఏపీ భవన్‌లో తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశమయ్యారు. పాలనాపరంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ పరంగా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎంపీలను సంప్రదించడం లేదన్న అంశంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

లంచం అడిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక…

వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు : కేసీఆర్‌

హైదరాబాద్‌ : వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయకపోతే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ఆయన ఇందిరాపార్కు వద్ద వ్యాట్‌కు నిరసనగా వస్త్రవ్యాపారులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్‌ కోతలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయని,…

వైఎస్‌ఆర్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్‌ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్బావ దినోత్సవం వేడుకలను పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భవించి…

పిల్లలను విక్రయించిన ఇద్దరు అరెస్ట్‌

విశాఖపట్నం : తగరపువలసలో పిల్లలను విక్రయించడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారు తగరపువలసలో ఇద్దరు చిన్నారులను విక్రయించడానికి ప్రయత్నించారు.

సల్‌ఫోన్‌లో అశ్లీల దృశ్యాలు, వ్యక్తి అరెస్ట్‌

విశాఖపట్టణం : సెల్‌ఫోన్‌లో మహిళల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించిన యల్లా శ్రీనివాస్‌ అనే వ్యక్తిని భీమిలి పోలిసులు అరెస్ట్‌ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలే : యడ్యూరప్ప

బెంగళూరు : తన తర్వాతి లక్ష్యం అసెంబ్లీ ఎన్నికలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ పార్టీ నేత యడ్యూరప్ప తెలిపారు. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. తన మొదటి లక్ష్మం నెరవేరిందన్నారు.…

నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విఫలం

న్యూఢిల్లీ : భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యం మార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నార్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ – డీఆర్‌డీవో…

ఉగాది నుంచి హెల్త్‌ కార్డుల పథకాలు ప్రారంభం

మంత్రి కొండ్రు మురళి ప్రకటన హైదరాబాద్‌ : రాష్ట్ర్ణప్రభుత్వ ఉద్యోగలకు ప్రభుత్వం ఉగాది కానుకను ప్రకటించింది. ఈ ఉగాది నుంచి హెల్త్‌ కార్గుల పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు వైద్యవిద్యా శాఖ మంత్రి కొండ్రు మురళి తెలిపారు. వంద శాతం ఉద్యోగులు,…

ఫాప్సీ ఎక్సలెన్సీ అవార్డుల నామినేషన్లకు ఆహ్వానం

హైదరాబాద్‌ : రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య ఏటా ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల కార్యక్రమం నిర్వహణకు తెరలేచింది.సూక్ష్మ, మధ్య, భారీ తరహా పరిశ్రమలకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఈ అవార్డులకు నామినేషన్లు కోరుతున్నట్లు ఫ్యాప్సీ ప్రధాన కార్యదర్శి…