Monday, 16 November 2026

వార్తలు

దూరదర్శన్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ : సెంట్రల్‌ ఢిల్లీలోని మండిహౌస్‌ ప్రాంతంలోని దూరదర్శన్‌ కార్యాలయంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయంలోని ఐదో  అంతస్తులో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడ్డాయి. 22 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి…

6నుంచి క్రీడా వేడుకలు

హైదరాబాద్‌: కస్తూరిబాగాంథీ బాలికా విద్యాలయాల (కె.జి.బి.వి.వి) రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు ఈనెల 6 నుంచి  8 వరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సుమారు రెండువేల మంది విద్యార్థినులు పాల్గొంటారని రాజీవ్‌ విద్యా మిషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌…

పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

కరీంనగర్‌: మానకొండూరు మండలం చేజర్లలోని పత్తిమిల్లులో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 450 క్వింటాళ్ల పత్తి దగ్థమైంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

పోస్కో ప్రాంతంలో బాంబు పేలుడు.. నలుగురి మృతి

భువనేశ్వర్‌ :ఒడిశాలో పోస్కో పరిశ్రమ నిర్మించ తల పెట్టిన జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా దింకియా మండలంలోని పటనా గ్రామంలో శనివారం రాత్రి జరిగిన బాంబు పేలుడులో నలుగురు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనలో పోస్కో వ్యతిరేక ఉద్యమ…

ఒక కంట కన్నీరు.. మరోకంట పన్నీరు

భావోద్వేగానికి లోనైన అద్వానీ న్యూఢిల్లీ, మార్చి 2 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీనియర్‌ నేత అద్వానీ ఒక దశలో చిరునవ్వులు చిందించగా, మరో దశలో భావోద్వేగానికి గురయ్యారు.…

ఉత్తరప్రదేశ్‌లో నదిలో పడిన జీపు.. 11 మంది మృతి

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో ప్రయాణీకులతో వెళ్తుఉన్న జీపు అదుపుతప్పి నదిలో పడిపోవడంతో 11 మంది మృతి చెందారు. సాయినదిలోకి జీపు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద మృతుల కుటంబీకులకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ రూ. 2 లక్షల…

ఆస్ట్రేలియా స్కోరు 237/9

హైదరాబాద్‌: భారత్‌తో ఆడుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న ఆస్ట్రేలియా 237 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తొమ్మిది వికెట్లకు ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి డిక్లేర్‌ ప్రకటించింది. భారత  బౌలర్లు భువనేశ్వర్‌కుమార్‌, జడేజా…

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌: భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టుమ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో క్లార్క్‌ (91) క్లీన్‌ బౌల్డయ్యాడు.

పోలవరం టెండర్లలోనూ భారీ కుంభకోణం : దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: పోలవరం టెండర్ల భారీ కుంభకోణం ఉందని మండలి ప్రతిపక్ష నేతదాడి వీరభద్రరావు ఆరోపించారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఈ అంశంపై ఉభయ సభల్లోను చర్చించి నిర్ణయం తీసుకునే వరకు ఖరారు. చేయరాదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌…

ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాం : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ : రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న భాజపా జాతీయ సమావేశాల్లో దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు.