Monday, 16 November 2026

వార్తలు

నిరాశపర్చిన బాబ్లీ తీర్పు

సమర్థవంతంగా వాదన వినిపించలేకపోయిన సీమాంధ్ర సర్కార్‌ బాబ్లీని పూర్తి చేసుకోమని సుప్రీం తీర్పు హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 (జనంసాక్షి): సుప్రీం కోర్టులో బాబ్లీపై ఇచ్చిన తీర్పు నిరాశ పర్చింది. సీమాంధ్ర సర్కార్‌ సమర్థవంతంగా వాదన వినిపించలేకపోవడం వల్లే వ్యతిరేకంగా…

నాగా, మేఘా, త్రిపురాలో అధికార పక్షాలే విజేతలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (జనంసాక్షి) : నాగాలాండ్‌, మేఘాలయ, త్రిపుర ఎన్నికల్లో అధికార పక్షాలే విజయభేరి మోగించాయి. గురు వారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. త్రిపుర రాష్ట్రంలో మొత్తం 60 నియోజకవర్గాలకు…

నష్టాల్లోకి స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగం జరుగుతున్నంతసేపు గిసిలాట ధరోణి కనబర్చిన స్టాక్‌మార్కెట్లో సమ్మెదిగా నష్టాల్లోకి జారుతున్నాయి. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 5759 వద్ద, బీఎన్‌ఈ సెస్సెక్స్‌ 107 పాయింట్ల నష్టంతో 19045 వద్ద ట్రేడవుతోంది.

హైఎండ్‌ వాహనాలపై వడ్డింపు

హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో విలాసవంతమైన వాహనాలపై సుంకాలను పెంచారు. ఇది ఆటోమొబైల్‌ రంగాన్ని కొంత నిరాశకు గురిచేసింది. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు.

డీటీహెచ్‌ మరింత భారం

హైదరాబాద్‌: డీటీహెచ్‌ సేవలకు చిదంబరం బడ్జెట్‌ నిరాశ మిగిల్చింది. సెట్‌ఆఫ్‌ బాక్స్‌లపై సుంకాన్ని పెంచడంతో అవి మరింత భారం కానున్నాయి.

ధరలు తగ్గివే… పెరిగేవి ఇవే..

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన 2013-14 బడ్జెట్‌ లో కొన్ని వస్తువులపై సుంకాలు పెంచారు. దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా, మరికొన్ని వాటి ధరలు తగ్గాయి. 800 సీసీ ద్విచక్రవాహనాలపై 60…

కొత్తగా 3000 కిలోమీటర్ల రహదారులు

హైదరాబాద్‌: బడ్జెట్‌లో కొత్తగా 3000 కిలోమీటర్ల రహదారుల్ని ప్రతిపాదించారు. దీంతో కష్టాల్లో ఉన్న ఇన్‌ఫ్రా రంగానికి కొంత తం ఇచ్చినట్లైంది.

బడ్జెట్‌ ప్రసంగం పూర్తి

న్యూఢిల్లీ : లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం బడ్జెట్‌ ప్రసంగం పూర్తయింది. ప్రసంగానంతరం ఆయన సభలో ఫైనాన్స్‌ బిల్లు ప్రవేశపెట్టారు. తర్వాత స్పీకర్‌ మీరాకుమార్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

వూగిసలాటలో స్టాక్‌ మార్కెట్‌

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రసంగ సమయంలో స్టాక్‌ మార్కెట్లు వూగిసలాట ధోరణిలో ఉన్నాయి. తొలుత లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభమైన గంటకు నష్టాల్లోకి జారిపోయాయి. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 5783 వద్ద ఉండగా బీఎన్‌ఈ సెన్‌సెక్స్‌…