Monday, 16 November 2026

వార్తలు

ధోని (224) ఔట్‌

చెన్నై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 546 పరుగుల వద్ద ధోని (224) వికెట్‌ను కోల్పోయింది. ద్విశతకాన్ని నమోదు చేసిన ధోని పట్టిన్సన్‌ బౌలింగ్‌లో వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 8 వికెట్ల నష్టానికి…

కారు ఢీకొని ఇంటర్‌ విద్యార్థి మృతి

చేగుంట: సైకిల్‌పై కళాశాలకు వస్తున్న ఓ  విద్యార్థిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మెదక్‌ జిల్లా చేగుంట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదువుతున్న స్వామి (17) అనే విద్యార్థి స్వగ్రామం పోతనపల్లి నుంచి సైకిల్‌పై కళాశాలకు…

‘ అప్కాబ్‌ ‘ అభ్యర్థి ఎంపికపై నేతలతో బొత్స భేటీ

హైదరాబాద్‌: గాంధీభవన్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ అధ్యక్షులతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఆప్కాబ్‌ ఛైర్మన్‌ అభ్యర్ధిని ప్రకటించనున్నారు. తర్వాత అభ్యర్థితో కలిసి వెళ్లి నేతలు నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మౌలాలీలో మహిళ హత్య

హైదరాబాద్‌: మౌలాలీ వడ్డెర బస్తీలో లక్ష్మీ అనే మహిళ (50) హత్యకు గురైంది. కూలీ చేసుకుంటూ జీవించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు ఆమెను కత్తితో పొడిచి చంపారు. ఆమె ఒంటిపై ఉన్న నగలు మాయమవడంతో…

దూసుకుపోతున్న ‘ లైఫ్‌ ఆఫ్‌ పై’

లాన్‌ఏంజిల్స్‌: భారతీయత నేపథ్యంలో తెరకెక్కిన ‘ లైఫ్‌ ఆఫ్‌’పై చిత్రం ఆస్కార్‌ అవార్డుల రేసులో దూసుకుపోతోంది. మొత్తం 11 విభాగాల్లో ఈ సినిమా నామినేట్‌ అయింది. ఉత్తమ సినిమాటోగ్రఫీ, విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగాల్లో అవార్డులను దక్కించుకుంది. మరిన్ని విభాగాల్లో…

చెక్కర కర్మాగారంలో పేలిన జనరేటర్లు

చోడవరం : విశాఖ జిల్లా చోడవరం చ్కెర కర్మాగారంలో ఈ ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. 500 కేవీ జనరేటర్లు రెండు పేలిపోయి మంటలు వ్యాపించాయి. దీంతో కార్మికులు భయంతో బయటకు పరుగుతు తీశారు. ఈ ఘటనతో కార్మాగారంలో రోజువారి…

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్‌: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని…

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్‌: 14 జిల్లాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మూడు ఉపాధ్యాయ, మూడు పట్టభద్రలు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం ఆయా జిల్లా కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని…

నేడు షార్‌కు రాష్ట్రపతి రాక

నెల్లూరు: పీఎన్‌ఎల్‌వీ-సి20 ప్రయోగాన్ని వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నేడు నెల్లూరులోని షార్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి చెన్నైకి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీహరికోటకు వస్తారు. సాయంత్రం 5.30కు ప్రయోగాన్ని వీక్షించి రాత్రికి షార్‌లోనే…

కోనేరులో పడి బాలుడి మృతి

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం దొండపాడులో రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓబాలుడి కోనేరులో పడి మృతి చెందాడు. రవి (14) అనే బాలుడు ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు కోనేరులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు…