Sunday, 15 November 2026

వార్తలు

బీహార్‌లో కల్తీ మద్యానికి 8 మంది బలి

పాట్నా : బీహార్‌లోని ఆరా గ్రామంలో కల్తీ మద్యం తాగిన ఘటనలో 8 మంది ప్రాణాలను కోల్పోయారు. పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై బీహార్‌ ప్రభుత్వం  విచారణకు ఆదేశించింది.

ఎఫ్‌డీఐలపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌ఢీఐల అంవంపై నేడు రాజ్యసభలో ఓటింగ్‌ జరుగుతుంది. ఈ ఓటింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీ గైర్హాజరు కానుండగా బీఎస్పీ మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకుంది. మల్టీబ్రాండ్‌ చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను…

ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం

సుండుపల్లి: చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం గన్నిమిట్లకు చెందిన గజ్జెల శ్రీనివాసులు రెడ్డి అనే ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ చట్టం ప్రయోగిస్తూ కడప కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇతను కడప జిల్లాలో పలు ఎర్రచందనం…

మట్టిమిద్దె కూలి ఇద్దరి మృతి

కర్నూలు : పాములపాడు మండలం బానుముక్కలలో మట్టిమిద్దె కూలి ఇద్దరు మృతి చెందారు. వర్షం నీటికి మిద్దె నాని కూలినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక విచారణ చేపట్టారు.

పసుపుమిల్లులో అగ్నిప్రమదం

గుంటూరు : దుగ్గిరాలలోని పసుపుమిల్లులో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగిభారీగా ఎగసిపడ్డాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. నష్టం విలువ రూ. లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

తమిళనాడుకు కావేరి జలాల విడుదల

బెంగుళూరు : సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నది జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం ప్రారంభించింది. గురువారం రాత్రి నుంచి కృష్ణ రాజసాగర్‌ 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల…

ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ

పెనుగొండ : అనంతపురం జిల్లా పెనుగొండ అల్విన్‌ కాలనీలోని ఉపాధ్యాయుని ఇంట్లోచోరీ జరిగింది. నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.3.50లక్షల విలువైన బంగారు ఆభరణాలతోపాటు రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు బాధితుని ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు…

ఫిలిఫ్పీన్స్‌లో పెను తుపాను : 475కు చేరిన మృతుల సంఖ్య

మనీలా: బోఫా పెను తుపాను ఫిలిఫ్పీన్స్‌ను అతలాకుతలం చేస్తోంది. తుపాను ధాటికి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 475కు చేరింది. వివిధ ప్రాంతాల్లో మూడు వందల మందికిపైగా గల్లంతయ్యారు. ఒక్క కంపోస్టెల కొండ ప్రాంతంలోనే 184…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 28 పాయింట్లకుపైగా లాభపడింది. నీఫ్టీ కూడా 3 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

భారతీయ బాక్సింగ్‌ సమాఖ్య రద్దు

న్యూఢిల్లీ : ఒలింపిక్స్‌ సంఘం రద్దుతో కుంగిపోతున్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ బాక్సింగ్‌ సమాఖ్యను రద్దు చేస్తూ బాక్సింగ్‌ అంతర్జాతీయ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇటీవల భారతీయ బాక్సింగ్‌ సమాఖ్య ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే కారణంగా…