Saturday, 14 November 2026

వార్తలు

పరిస్థితి అదుపులోనే ఉంది: మహేశ్‌

హైదనాబాద్‌: పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని నగర జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మహేశ్‌ భగవత్‌ తెలియజేశారు. కానీ పాత బస్తీలో బందోబస్తు యధాతధంగా కొనసాగిస్తామని ఆయన తెలియజేశారు.

ఛానళ్లపై కేసులు

హైదరాబాద్‌: నిన్న పాతబస్తీలో అల్లర్లపై వివాదాస్పద చిత్రాలు ప్రచారం చేసిన ఛానళ్లపై కేసులు నమోదు చేయనున్నారు. ఈ విషయాన్ని సమాచార శాఖ తెలిపింది.

యూపీఏకు వ్యతిరేకంగా అవిశ్వాసం: తృణమూల్‌

ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ తీర్మానానికి సహకరించాలని యూపీఏ భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలను ఆ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోరారు.

దిగ్విజయ్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : భాజపా అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌ సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్‌ 21న హాజరు కావాలని దిగ్విజయ్‌సింగ్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది.

ఎంఐఎం నేతల పై తెరాస ఫిర్యాదు

హైదరాబాద్‌: పాతబస్తీలో రెచ్చగెట్టే ప్రసంగాలు చేశారని ఎంఐఎం నేతలపై తెరాస నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

ఈ పర్యటనలో చాలా నేర్చుకున్నాను : సూకీ

అనంతపురం: భారతదేశ పర్యటనలో తాను చాలా పాఠాలు నేర్చుకున్నానని మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, నోబుల్‌ బహుతి గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీ పేర్కొన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని…

స్కూల్‌ బస్సును ఢీకొన్న రైలు: 47మంది విద్యార్థుల మృతి

ఈజిఫ్ట్‌: వేగంగా వెళుతున్న రైలు స్కూల్‌ బస్సును ఢీకొన్న సంఘటనలో 47 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన దక్షిణ ఈ సంఘటన దక్షిణ ఈజిఫ్ట్‌లో చోటుచేసుకుంది. చిన్నారులంతా 4నుంచి 6 సంవత్సరాలలోపు వారే. అల్‌-మండర గ్రామం…

అంచనాల కమిటీ భేటీ

హైదరాబాద్‌ : శాసనసభ కమిటీ హాల్లో శనివారం అంచనాల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో రవాణాశాఖ, ట్రాఫిక్‌ విభాగాలపై సమీక్షలు జరుపుతారు.

సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిర్ణయాలు

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఇవాళ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది, ఈ సమావేశానికి టీఎన్జీవోల అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హాజరయ్యారు. సచివాలయం ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్‌ నరేందర్‌రావు సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యోగుల…

ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధం : వెంకయ్య

హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. ఎంఐఎం రాజకీయపార్టీ కాదని, దాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్సేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌ దేశాన్ని విదేశాలకు తాకట్ల పెడుతుందని ఆయన ధ్వజమెత్తారు.