Saturday, 14 November 2026

వార్తలు

జగన్‌ కోసమే మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు సిఎం

  హైదరాభాద్‌ : మజ్లిస్‌ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బోత్ససత్యనారాయణ పార్టీ అదిష్టానానికి వేర్వేరు నివేదికలు సమర్పించినట్లు తెలుస్తోంది. మజ్లిస్‌ మద్దతు ఉపసంహరణతో రాజకీయం వేడెక్కిన స్థితిలో బోత్స సత్య నారాయణ ఢిల్లీకి…

భారతదేశ అభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకం: సూకీ

అనంతపుర్లం: మయన్మార్‌ పత్రిపక్ష నేత, నోబెల్‌ అవార్డు గ్రహీత అంగ్‌ శనివారం అనంతరం జిల్లాలోని పాపసానిపల్టిలో పర్యటించారు. పోదుపు సంఘాలపనితీరును తెలుసుకున్న సూకీ మాట్లాడుతూ భారతదేశఅభివృద్దిలో మహిళాసాధికారత ఎంతో కీలకమని అన్నారు. మహాత్మగాంధీ గ్రామిణ ఉపాది హామీ పథకం…

సవితమృతిపై వివరణకోరిన అమ్నెస్టీసంస్థ

  లండన్‌(జనంసాక్షి), అబార్షన్‌ జరగకపోవడం వలన భారత దంత వైద్యురాలు సవిత హలప్పనవర్‌ చనిపోవటంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఐర్లాండ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది ఐర్లాండ్‌ ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలకు అనుగుణంగా ఉండేటట్లు…

బాబుకు షర్మిళ సవాల్‌

  కర్నూలు: అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదనపై వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సవాల్‌ విసిరారు.తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందా…

బాల్‌థాకరే మృతికి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: శివసేన పార్టీ అధినేత బాల్‌థాకరే మృతికి టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం తెలియజేవారు. బాల్‌థాకరే కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అయన మరణం తనను కలిచివేసిందన్నారు.

ముప్పులేదు: 2014లోనే ఎన్నికలు : చిదంబరం

ఢిల్లీ:  యుపీఏ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని 2014లో జరుగబోయే ఎన్నికలకే ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. తప్ప ఆ లోపున కాదని ఆర్ధిక మంత్రి పి. చిదంబరం శుక్రవారం స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిలకడగా కొనసాగుతుందన్నారు. చిల్లర…

శివసేనా అధినేత బాల్‌థాక్రే కన్నుమూత

శివసేన అధినేత బాల్‌ థాకరే కన్నుమూత.. ముంబై: శివసేన అధినేత బాల్‌ థాకరే శనివారం కన్నుమూశారు.మధ్యాహ్నం మూడున్నర గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు.దాదాపు 50 ఏళ్ల పాటు ఆయన మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు.గత కొంత కాలంగా ఆయన…

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 111/0

అహ్మదాబాద్‌: రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 111 పరుగులు చేసింది. భారత్‌ 219 పరుగుల అధిక్యంలో ఉంది.

కేసీఆర్‌ మా ఉద్యమ నాయకుడు : శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: మా ఉద్యమ నాయకుడు టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ‘ అని తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా ముందుండి నడిపిస్తామని శ్రీనివాస్‌గౌడ్‌ తెలియజేశారు.

తెలంగాణలో టీడీపీ ఎప్పుడోగల్లంతైంది: ఈటెల

హైదరాబాద్‌: తెలంగాణలో టీడీపీ ఎప్పుడో గల్లంతైందని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిజామాబాద్‌ ఉప ఎన్నికల్లో టీడీపీకి కేవలం 1800 ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయని…