Saturday, 14 November 2026

వార్తలు

ఎంఐఎం తొత్తుగా ముఖ్యమంత్రి వ్యవహారిస్తున్నారు: కిషన్‌రెడ్డి

బాగ్‌లింగంపల్లి: పాతనగరంలోని భాగలక్ష్మి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి  పనులను ఎంఐఎం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ భాజపా ర్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లిలోని సందరయ్య పార్క్‌ నుంచి ఇందిరా పార్క్‌ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి…

ముగిసిన తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

రంగారెడ్డి : నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని తెదేపా ప్రభుత్వాన్ని కోరింది, అధినేత చంద్రబాబు అధ్యక్షతన రంగారెడ్డి జిల్లాలో పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది, భేటీ వివరాలను పార్టీ నేత…

సీఐఏ సంచాలకుడు ఆకస్మిక రాజీనామా

వాషింగ్టస్‌: అమెరికా సీఐఏ సంచాలకుడు డేవిడ్‌ పీట్రాయిస్‌ ఆకస్మికంగా రాజీనామా చేశారు. వివాహేతర సంబంధం కారణంగానే డైరెక్టర్‌ బాద్యతల నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం, ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఒబామా ఆమోదించినట్లు సీఐఏ వర్గాలు వెల్లడించాయి.

ఢిల్లీ సీఎం షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 1984 అల్లర్ల బాధితులు ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించారు. తమకు న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. సీఎం షీలాదీక్షిత్‌ నివాసం వద్ద భారీగా…

కోర్‌ కమిటీ సభ్యులతో అన్నా భేటీ

ఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే కోర్‌కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. అన్నాబృందం రద్దయిన తర్వాత తొలిసారిగా కోర్‌ కమిటీ సభ్యులతో ఈ భేటీ జరుగుతోంది. భవిష్యత్‌ వ్యూహాలపై సభ్యులు చర్చిస్తున్నారు.

అగ్ని ప్రమాదంలో ఆర్మీ అధికార సజీవదహనం

బందిపొర: జమ్మూకాశ్మీర్‌లోని బండిపోర జిల్లాలోని ఆర్మీ క్యాంపులో జరిగిన అగ్ని ప్రమాదంలో లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయి. అధికారి సజీవ దహనమయ్యాడు. సునెర్వనీ ప్రాంతంలోని ప్రత్యేక బలగాల క్యాంపులో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టి విద్యుదాఘాతంతో…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,100 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 30,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…

గంజాయి తోటలపై దాడులు

రేగొండ: వరంగల్‌ జిల్లా రేగొండ మండలంలోని రేపాకలిపల్లి గ్రామంలో రైతులు సాగుచేస్తున్న గంజాయి తోటలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, ఎక్సైజ్‌ శాఖ పోలీసులు ఈ రోజు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన గుల్ల నర్సయ్య, గుల్ల భిక్షపతి అనే ఇద్దరు…

హైటెక్స్‌లో స్థిరాస్తి ప్రాపర్టీ షో ప్రారంభం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ స్థిరాస్తి అభివృద్ధి సమాఖ్య ప్రాపర్టీ షో హైటెక్స్‌లో ప్రారంభమైంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యక్రమాన్ని జ్యోతి వెలగించి ప్రారంభించారు. ఈ షోలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవితోపాటు పలువురు నేతలు పాల్గోన్నారు.

చెన్నైలో భాజపా దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు

చెన్నై : భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల మేధోమథన సదస్సు నేడు చెన్నైలో జరగనుంది. ఈభేటీలో దక్షిణాది రాష్ట్రల్లో పార్టీ అభివృద్ధితో పాటు తెలంగాణ అంశంపై నేతలు చర్చించనున్నారు.